AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ప్రభాస్‌ సినిమాకి 2000 కోట్లు పక్కా.. సలార్‌ సినిమాపై జోస్యం చెప్పిన స్టార్‌ కమెడియన్‌

ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ సలార్‌. ఆదిపురుష్‌ సినిమాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న డార్లింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మాత్రం పూర్తిగా మెప్పించలేకపోయాడు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ ఇప్పుడు సలార్‌ సినిమాపైనే ఉన్నాయి.

Salaar: ప్రభాస్‌ సినిమాకి 2000 కోట్లు పక్కా.. సలార్‌ సినిమాపై జోస్యం చెప్పిన స్టార్‌ కమెడియన్‌
Salaar Movie
Basha Shek
|

Updated on: Jul 09, 2023 | 9:48 PM

Share

ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ సలార్‌. ఆదిపురుష్‌ సినిమాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న డార్లింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మాత్రం పూర్తిగా మెప్పించలేకపోయాడు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ ఇప్పుడు సలార్‌ సినిమాపైనే ఉన్నాయి. దీనికి తోడు కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో పాపులరైన ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్‌ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల రిలీజైన సలార్‌ టీజర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది ప్రభాస్‌ టీజర్‌. ఇక ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్‌ సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. కాగా ఈ హై యాక్షన్‌ ఎంటటైనర్‌లో ప్రముఖ కమెడియన్‌ సప్తగిరి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్‌ పనులను పూర్తి చేసిన అతను ప్రభాస్‌ సినిమా పక్కాగా 2000 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఓ స్పెషల్‌ ట్వీట్‌ చేశాడు సప్తగిరి.

‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సలార్‌ సినిమాకు సంబంధించి నా డబ్బింగ్‌ పూర్తి చేశాను. ఈ మూవీ డబుల్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ప్రభాస్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌, హోంబలే ఫిల్మ్స్‌కి థ్యాంక్స్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు సప్తగిరి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అభిమానులు ఈ ట్వీట్‌ చేసి ఉప్పొంగిపోతున్నారు. సలార్‌ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!