AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: ‘చిన్నప్పుడే పులి లాంటి మనిషిని కలిశా’.. వైఎస్సార్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌

దివంగత సీఎం వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేసింది. వైఎస్సార్‌తో కలిసున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన ఆమె 'పేదవాళ్ల ని అడ్డు పెట్టుకుంటూ కేవలం వోట్ ఇంకా నోటు రాజకీయాలు చేస్తూ ఉంటే..

Poonam Kaur: 'చిన్నప్పుడే పులి లాంటి మనిషిని కలిశా'.. వైఎస్సార్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌
Actress Poonam Kaur
Basha Shek
|

Updated on: Jul 09, 2023 | 8:52 PM

Share

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జయంతి (జులై 7) సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా వైఎస్సార్‌ సేవలను స్మరించుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన సేవలను ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. ఈక్రమంలో దివంగత సీఎం వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేసింది. వైఎస్సార్‌తో కలిసున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన ఆమె ‘పేదవాళ్ల ని అడ్డు పెట్టుకుంటూ కేవలం వోట్ ఇంకా నోటు రాజకీయాలు చేస్తూ ఉంటే.. పేదవాళ్ల మనసులో చోటు దక్కించుకున్న అగ్ర నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అనుకోకుండా చిన్నప్పుడు ఈ పులి లాంటి మనిషి ని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని తెలుగులో ట్వీట్‌ చేసింది పూనమ్. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే పూనమ్‌ ట్వీట్‌లో చాలా అక్షర దోషాలు ఉన్నాయి. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. గూగుల్‌ ట్రాన్స్‌ లేటర్‌ను ఉపయోగించావా? అంటూ కామెంట్లు పెట్టారు. అయితే వైఎస్సార్‌ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు, జగన్‌ ఫ్యాన్స్‌ పూనమ్ ట్వీట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా 2006లో ఒక విచిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్‌ కౌర్‌. ఆ తర్వాత శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేశ్‌, నాగవల్లి, పయనం, గగనం, అటాక్‌, నాయకి, శ్రీనివాస కల్యాణం తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు పలు తమిళ్‌, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్