Vimanam: కన్నీళ్లు తెప్పిస్తోన్న ‘విమానం’.. ఓటీటీలో సముద్రఖని సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ప్రముఖ నటుడు అండ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ మూవీలో అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, మాస్టర్‌ ధృవన్, మీరా జాస్మిన్, ధన్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Vimanam: కన్నీళ్లు తెప్పిస్తోన్న 'విమానం'.. ఓటీటీలో సముద్రఖని సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Vimanam Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 09, 2023 | 7:46 PM

ప్రముఖ నటుడు అండ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ మూవీలో అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, మాస్టర్‌ ధృవన్, మీరా జాస్మిన్, ధన్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి విమానం సినిమాను నిర్మించారు. జూన్‌ 9న థియేటర్లలో విడుదలైన ఈ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కమర్షియల్‌ హంగులు లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్లు రాలేకపోయింది. అయితే తండ్రీ కొడుకుల అనుబంధంతో కూడుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే దక్కాయి కానీ వసూళ్లు రాలేదు. దీంతో నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ 5 విమానం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈక్రమంలో జూన్‌ 30 నుంచి సముద్ర ఖని సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చింది.

కాగా విమానం సినిమాకు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన 9 రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వావరా అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. దివ్యాంగుడైన ఓ తండ్రి విమానం ఎక్కాలన్న తన కుమారుడి కలను ఎలా నిజం చేశాడన్న ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో విమానం మూవీని తెరకెక్కించారు డైరెక్టర్‌ శివ ప్రసాద్‌. అలాగే సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ, చెప్పులు కుట్టుకునే కోటి పాత్రలో రాహుల్, డేనియల్‌గా ధనరాజ్‌ల అభినయం అందరినీ కట్టిపడేసింది. ఈక్రమంలో విమానంలోని సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఓటీటీ ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మరి థియేటర్లలో విమానం మిస్‌ అయ్యారా? ఒకవేళ చూసినా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వెంటనే లాగిన్‌ అవ్వండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.