AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్యతో ఉన్నఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? హీరోగా ఎంట్రీతోనే టాలీవుడ్‌ రికార్డులు బద్దలు..

సినిమా హీరోల చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇట్టే వైరలవుతుంటాయి. అభిమానులు కూడా వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో నిత్యం త్రో బ్యాక్‌ ట్యాగ్ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది.

Balakrishna: బాలయ్యతో ఉన్నఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? హీరోగా ఎంట్రీతోనే టాలీవుడ్‌ రికార్డులు బద్దలు..
Balakrishna
Basha Shek
|

Updated on: Jul 11, 2023 | 2:03 PM

Share

సినిమా హీరోల చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇట్టే వైరలవుతుంటాయి. అభిమానులు కూడా వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో నిత్యం త్రో బ్యాక్‌ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ఇందుకు తగ్గటుగానే సినిమా తారలు తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ తమ చిన్ననాటి లేదా రేర్‌ ఫొటోస్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. అవి కొద్ది క్షణాల్లోనే వైరలవుతుంటాయి. అలా పై ఫొటో కూడా నెట్టింట వైరలవుతోంది. ఇందులో బాలకృష్ణ చేతిలో ఒక బుడ్డోడు కూడా ఉన్నాడు. చూడ్డానికి ముద్దొచ్చేస్తున్న అతను కూడా ఒక టాలీవుడ్‌ హీరోనే. సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమాతో కెరీర్‌ ఆరంభిస్తాడు. అయితే ఇతను మాత్రం ఏకంగా సినిమా కెరీర్‌ ఆరంభించిన రోజే ఏకంగా 9 సినిమాలకు కొబ్బరికాయ కొట్టాడు. తద్వారా తన ఎంట్రీతోనే సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచేశాడు. అయితే అదే జోరును మాత్రం కొనసాగించలేకపోయాడు. అయితే నటన పరంగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు. విలన్‌గా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే అనుకోకుండా గుండెపోటుతో ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాయో.. యస్‌. అతను మరెవరో కాదు కొన్ని నెలల క్రితమే కన్నుమూసిన నందమూరి తారకరత్న.

గతేడాది సారథి, S5 నో ఎగ్జిట్‌ సినిమాలతో అభిమానులను పలకరించాడు తారకరత్న. అలాగే 9 అవర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించాడు. అయితే నటుడిగా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవ చేయాలనుకున్నాడు. అందులో భాగంగా ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతోన స్థానికంగా చికిత్స అందించి ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ కూడా అతని పరిస్థితి మెరగుపడలేదు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 అందరినీ విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..