Comedian Satya : సినిమాల్లోకి రాక ముందు కమెడియన్ సత్య ఏం చేసేవాడో తెలుసా..?
ఈ మధ్య కాలంలో హీరోలే చాలా వరకు కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న కొద్దీ మంది కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ పేరు ప్రధమంగా వినిపిస్తుంది. ఆతర్వాత చెప్పుకునే పేరు సత్య.

కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమాల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్న కొంతమంది కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, అలీ, సునిల్ ఇలా పలువురి పేర్లు చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో హీరోలే చాలా వరకు కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న కొద్దీ మంది కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ పేరు ప్రధమంగా వినిపిస్తుంది. ఆతర్వాత చెప్పుకునే పేరు సత్య. కమెడియన్ సత్య.. ఆయన నటనకు, కామెడీ టైమింగ్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ మొఖంలో నవ్వు వస్తుంది. పిల్ల జెమీందార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా నాగ శౌర్య నటించిన రంగబలి సినిమాలో నటించాడు. సినిమా మొత్తంలో సత్య కామెడీ హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా యాంకర్స్ ను ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకున్నాడు.
సినిమాల్లోకి రాక ముందు సత్య ఏం చేసేవాడో తెలుసా.? ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాడు సత్య. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేస్తూ.. అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగేవాడట. సత్యను కమెడియన్ ధనరాజ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అప్పటికే ధనరాజ్ సినిమాల్లో నటిస్తూనే.. జబర్దస్త్ లో చేస్తున్నాడు. సత్యను తన స్కిట్ లో తీసుకున్నాడు. అలా చాలా కాలం జబర్దస్త్ లో కొనసాగాడు సత్య. ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు.
.