Balakrishna: బాలయ్యకు నచ్చితే అంతే మరి.. లేడీ ఫ్యాన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన నందమూరి నటసింహం

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైకి గంభీరంగా కనిపించినా ఆయన చాలా సున్నితత్వం. చాలాసార్లు అభిమానుల మీద కస్సుబుస్సులాడినా బాలయ్య మనసు బంగారం. ఆయన గురించి పూర్తిగా తెలిసినవారు ఏదైనా ఇదే మాటలు చెబుతారు. స్వచ్చమైన మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు.

Balakrishna: బాలయ్యకు నచ్చితే అంతే మరి.. లేడీ ఫ్యాన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన నందమూరి నటసింహం
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Jul 11, 2023 | 10:38 AM

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైకి గంభీరంగా కనిపించినా ఆయన చాలా సున్నితత్వం. చాలాసార్లు అభిమానుల మీద కస్సుబుస్సులాడినా బాలయ్య మనసు బంగారం. ఆయన గురించి పూర్తిగా తెలిసినవారు ఏదైనా ఇదే మాటలు చెబుతారు. స్వచ్చమైన మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇటీవల విమానంలో పరిచయమైన ఓ వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారాయన. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు నందమూరి నటసింహం. ఒక లేడీ అభిమాని పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. కేక్‌ కటింగ్‌ చేయించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అమెరికాలో జరుగుతున్న తానా సంబరాల్లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తానా సభల కోసం ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్పియాలోనే ఉంటున్నారు బాలయ్య. ఆయన సతీమణి వసుంధరతో పాటు తానా మహాసభల్లో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా తెలుగు వారి రాజసం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు బాలయ్య. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. తన పుట్టిన రోజు అని చెప్పగానే.. వెంటనే ఆమెతో కేక్‌ కటింగ్‌ చేయించాడు.

అనంతరం బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి ఆ అమ్మాయిని మనసారా ఆశీర్వదించారు. తద్వారా ఆ లేడీ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలయ్య అభిమానులు దీనిని చూసి మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య మనసు బంగారం.. దటీజ్‌ బాలయ్య’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో భగవత్‌ కేసరి అనే మూవీలో నటిస్తున్నారు బాలయ్య. కాజల్‌ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..