AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikita Thukral: వేణు ‘కల్యాణ రాముడు’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

వేణు తొట్టెంపూడి నటించిన సూపర్‌ హిట్ సినిమాల్లో కల్యాణ రాముడు ఒకటి. రామ్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌లో ప్రభుదేవా, నాసర్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. 2003లో రిలీజైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. కాగా ఈ కుటుంబ కథాచిత్రంలో హీరోయిన్‌గా నటించింది నిఖిత తుక్రాల్‌.

Nikita Thukral: వేణు 'కల్యాణ రాముడు' హీరోయిన్‌  గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Kalyana Ramudu Movie
Basha Shek
|

Updated on: Jul 11, 2023 | 11:49 AM

Share

వేణు తొట్టెంపూడి నటించిన సూపర్‌ హిట్ సినిమాల్లో కల్యాణ రాముడు ఒకటి. రామ్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌లో ప్రభుదేవా, నాసర్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. 2003లో రిలీజైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. కాగా ఈ కుటుంబ కథాచిత్రంలో హీరోయిన్‌గా నటించింది నిఖిత తుక్రాల్‌. వేణును ఆటపట్టిస్తూనే అతని ప్రేమలో పడే కల్యాణి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన నిఖిత మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ఆర్యన్‌ రాజేష్‌తో కలిసి టాలీవుడ్‌కు ‘హాయ్‌’ చెప్పింది. ఆ తర్వాత కల్యాణ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, అనసూయ, ఏవండోయ్‌, డాన్‌, చింతకాయల రవి వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది. ఇక కన్నడలో కొన్నేళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారామె. తన అందం, అభినయంతో తమిళ్‌, మలయాళం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది నిఖిత. అయితే సినిమా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉండగానే ముంబైకు చెందిన గగన్‌ దీప్‌ సింగ్‌ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో చాలామంది లాగే పెళ్లయిన తర్వాత సినిమాలను బాగా తగ్గించేసింది.

2016లో నిఖిత వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు ముంబైలోనే స్థిరపడ్డారు. పెళ్లి తర్వాత కొన్ని తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించింది నిఖిత. అయితే తెలుగులో పెద్దగా కనిపించలేదు. 2016 శ్రీకాంత్ హీరోగా వచ్చిన టెర్రర్‌ సినిమాలో చివరిగా కనిపించింది. ప్రస్తుతం కూతురు జాస్మీరా ఆలనాపాలనాలోనే బిజీగా ఉంటోంది. అలాగే ఓ ప్రముఖ డిజైనర్‌తో కలిసి బిజినెస్‌ వ్యవహారాలను చూసుకుంటోంది. సినిమాలకు దూరంగా ఉన్న నిఖిత సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు తన భర్త, కూతురు ఫొటోలను షేర్‌ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు నిఖిత అందం ఏం తగ్గలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇటీవల నిఖిత షేర్‌ చేసిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ