AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: వైద్యం కోసం విదేశాలకు సమంత.. క్లారిటీ ఇచ్చిన సామ్ హెయిర్ స్టైలిస్ట్..

ఇప్పటికే ఖుషి చిత్రీకరణను పూర్తి చేయగా.. గురువారం సిటాడెల్ షూటింగ్ సైతం కంప్లీట్ అయ్యిందని. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. జూలై 13 తన జీవితంలో చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది సామ్. అలాగే ఆమె ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుందని.. దాదాపు ఏడాదిపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుందని టాక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

Samantha: వైద్యం కోసం విదేశాలకు సమంత.. క్లారిటీ ఇచ్చిన సామ్ హెయిర్ స్టైలిస్ట్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2023 | 3:17 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన చేతిలోని రెండు చిత్రాలను కంప్లీట్ చేసింది. ఇప్పటికే ఖుషి చిత్రీకరణను పూర్తి చేయగా.. గురువారం సిటాడెల్ షూటింగ్ సైతం కంప్లీట్ అయ్యిందని. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. జూలై 13 తన జీవితంలో చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది సామ్. అలాగే ఆమె ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుందని.. దాదాపు ఏడాదిపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుందని టాక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేందుకు విదేశాల్లో సామ్ వైద్యం తీసుకోనుందని.. ఇందుకోసం ఆమె సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా కానుందని.. ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై సామ్ గానీ.. ఆమె టీం గానీ స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ క్లారిటీ ఇచ్చారు.

సమంతతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆమె వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలిపారు. “వైద్యం తీసుకుంటున్న సమయంలో మరింత బలం, శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తుంటాం” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టును తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన సామ్.. అతడికి ఎమోషనల్ ఎమోజీస్ షేర్ చేస్తూ థాంక్స్ చెప్పింది. దీంతో ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుందనే విషయంలో క్లారిటీ వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సామ్.. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!