AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: తన జీవితంలో జూలై 13 చాలా స్పెషల్ అంటోన్న సమంత.. ఎందుకంటే..

గతంలో విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా నిన్న సాయంత్రం విడుదలైన ఆరాధ్య సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతోపాటు.. సామ్ సిటాడెల్ చిత్రంలోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది సామ్.

Samantha: తన జీవితంలో జూలై 13 చాలా స్పెషల్ అంటోన్న సమంత.. ఎందుకంటే..
Samantha Ruth Prabu
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2023 | 3:18 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నటించిన ఖుషి సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కనిపించనున్నారు. మహానటి చిత్రం తర్వాత పూర్థిస్తాయిలో ఓ జోడీగా నటిస్తున్నారు సామ్, విజయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా నిన్న సాయంత్రం విడుదలైన ఆరాధ్య సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతోపాటు.. సామ్ సిటాడెల్ చిత్రంలోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది సామ్.

జూలై 13న తన జీవితంలో అత్యంత స్పెషల్ అని..ఈరోజున సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తయ్యిందంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ జంటగా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ ఇది. దీనిని రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. త్వరలోనే ఖుషి చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత సిటాడెల్ కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాల అనంతరం సామ్ దాదాపు సంవత్సరం పాటు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం మయోసైటిస్. ఆమె ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేవరకు సినిమాలకు దూరంగా ఉండనుందని సమాచారం. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ సైతం తిరిగి ఇచ్చేసిందని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?