Project K: ప్రాజెక్ట్ K గ్లింప్స్ లో ఇది గమనించారా ? .. వీరుడి కథలో ఆ హీరో పాత్ర ?..

భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోన్న ఈ సినిమాను పూర్తిగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ విజువల్స్.. ప్రభాస్ న్యూలుక్స్ అదిరిపోయాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఈ గ్లింప్స్ చూసి సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఈ టీమ్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Project K: ప్రాజెక్ట్ K గ్లింప్స్ లో ఇది గమనించారా ? .. వీరుడి కథలో ఆ హీరో పాత్ర ?..
Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2023 | 3:05 PM

ఎట్టకేలకు పాన్ ఇండియా సినీ ప్రియుల నిరీక్షణకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఈవెంట్ కామింగ్ కాన్ వేదికపై రిలీజ్ చేశారు ప్రాజెక్ట్ కె టీమ్. ఈ సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోన్న ఈ సినిమాను పూర్తిగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ విజువల్స్.. ప్రభాస్ న్యూలుక్స్ అదిరిపోయాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఈ గ్లింప్స్ చూసి సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఈ టీమ్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కల్కి 2898AD గ్లింప్స్ నెట్టింట రికార్డ్స్ సెట్ చేస్తూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ సినిమా పేరును కల్కి అని పెట్టగా.. ట్యాగ్ లైన్ 2898AD అని పెట్టారు.అంటే ఈ చిత్రం కలియుగాంతం చివరి సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తోంది. ప్రపంచాన్ని చెడు అనే చీకటి కమ్ముకున్నప్పుడు ఓ వెలుగు వస్తుందని.. లోకాన్ని విలన్ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఓ కల్కి ఉద్భవించి ప్రజలను కాపాడతాడని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ పరిశీలిస్తే.. ఇందులో ఓ రాజు తన ప్రజలను పాలిస్తుంటాడు.

అతనిపై విలన్ దాడి చేసి రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రజలను తన బానిసలుగా మలుచుకుంటాడు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి రాజు వెళ్ళినప్పుడు హీరో వచ్చి విలన్ ను హతమారుస్తాడు. అయితే తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ ను చూపించి ది ఎండ్ అని వేసి.. ఆ తర్వాత ప్రభాస్ ను చూపించి ది బిగిన్స్ అని వేసారు. అంటే విలన్ చేతిలో పోరాడి ఓడిపోయి నిస్సహాయంగా అమితాబ్ ఉన్న సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో అమితాబ్ కొన్ని క్షణాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు స్టోరీ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!