Vijay Sethupathi: సౌత్ ఇండస్ట్రీపై బీటౌన్ తారల ఇంట్రెస్ట్.. విజయ్‌సేతుపతికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తుండగా త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించగా.. ఈ మూవీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ఆయన దేవర చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు బీటౌన్ సంచలన నటి కంగనా రనౌత్ మరోసారి సౌత్ లో మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Vijay Sethupathi: సౌత్ ఇండస్ట్రీపై బీటౌన్ తారల ఇంట్రెస్ట్.. విజయ్‌సేతుపతికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2023 | 3:44 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాహుబాలి మూవీ నుంచి స్టార్ట్ చేస్తే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులను దక్షిణాది చిత్రాలు ఆకట్టుకోవడమే కాకుండా.. రికార్డ్ స్తాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు దక్షిణాది సినీపరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్స్ సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అలియా భట్ ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి మెప్పించగా.. ఇప్పుడు అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సైతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తుండగా త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించగా.. ఈ మూవీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు ఆయన దేవర చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు బీటౌన్ సంచలన నటి కంగనా రనౌత్ మరోసారి సౌత్ లో మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది కంగనా. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు. ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథగా వచ్చిన తలైవి చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీ్ట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 15న అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో రాఘవ లారెన్స్ మెయిన్ రోలో పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కంగనా ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అహింసా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఓ ప్రాజెక్టులో కోలీవుడ్ హీరో, బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతితోపాటు.. హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తోన్న సినిమాకు విపిన్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!