Rashmika Mandanna: ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక.. చాలా బాధగా ఉందంటోన్న నేషనల్ క్రష్..

బీటౌన్ లో ఎక్కువగా సినిమాలు చేస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల దక్షిణాది చిత్రాలను వదులుకోవాల్సి వస్తుందని అంటోంది రష్మిక. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తాను కొన్ని మూవీస్ వదిలేయాల్సి వచ్చిందని.. అవి కూడా టాలీవుడ్, కోలీవుడ్ లోని పెద్ద హీరోస్ చిత్రాలని చెప్పుకోచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన మనసులోని మాటలను పంచుకున్నారు.

Rashmika Mandanna: ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక.. చాలా బాధగా ఉందంటోన్న నేషనల్ క్రష్..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2023 | 2:39 PM

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‏గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక. పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు నార్త్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే బీటౌన్ లో ఎక్కువగా సినిమాలు చేస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల దక్షిణాది చిత్రాలను వదులుకోవాల్సి వస్తుందని అంటోంది రష్మిక. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తాను కొన్ని మూవీస్ వదిలేయాల్సి వచ్చిందని.. అవి కూడా టాలీవుడ్, కోలీవుడ్ లోని పెద్ద హీరోస్ చిత్రాలని చెప్పుకోచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన మనసులోని మాటలను పంచుకున్నారు.

సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం చాలా ముఖ్యమని తెలిపింది రష్మిక. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన ఆచార్య చిత్రంలో వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుందట. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ తళపతి నటించిన మాస్టర్ మూవీని రిజెక్ట్ చేసానని.. ఇంత పెద్ద స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని వదులుకోవడం చాలా బాధను కలిగించిందని చెప్పుకొచ్చింది. కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా టాప్ పొజిషన్ కు చేరుకోవచ్చని చెప్పింది. తాను ముందుగా మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రష్మిక.. హిందీలో యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు.. తెలుగులో పుష్ప 2 చిత్రీకరణలోనూ పాల్గొంటుంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!