Bigg Boss 7 Telugu: ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్’.. బిగ్‏బాస్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున..

మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్ లిస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. సీరియల్ యాక్టర్స్ నుంచి యాంకర్స్, కమెడియన్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాపై స్పష్టత రానుంది. ఇక ఈసారి బిగ్‏బాస్ షో హోస్ట్ చేసేది కూడా నాగార్జునే అని క్లారిటీ వచ్చేసింది.

Bigg Boss 7 Telugu: 'న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్'.. బిగ్‏బాస్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున..
Nagarjuna
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: Aug 09, 2023 | 6:43 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తమిళం, కన్నడతోపాటు.. తెలుగులోనూ ఈ షో విజయవంతమైంది. ఓవైపు ఈ షోపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 స్టార్ట్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సీజన్ 7 సందడి షూరు అయ్యింది. ఇటీవలే ఈ షోకు సంబంధించిన లోగో పోస్టర్, టీజర్ రివీల్ చేస్తూ అడియన్స్‏లో మరింత ఉత్సాహం నింపారు నిర్వాహకులు. మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్ లిస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. సీరియల్ యాక్టర్స్ నుంచి యాంకర్స్, కమెడియన్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాపై స్పష్టత రానుంది. ఇక ఈసారి బిగ్‏బాస్ షో హోస్ట్ చేసేది కూడా నాగార్జునే అని క్లారిటీ వచ్చేసింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల టీజర్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరొక సందేహం కలిగించారు కింగ్ నాగ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ పాట పాడుతూ ఈసారి బిగ్‏బాస్ పై మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో సీజన్ 7 ఎలా ఉండబోతుందని అనే ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా దీనికి సమాధానమిచ్చారు నాగ్. త్వరలోనే బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుండడంతో.. బిగ్‏బాస్ షైనింగ్ స్టార్స్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. గత ఆరు సీజన్లలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ వేదికపై సందడి చేయగా.. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ బాధ్యతలు తీసుకోగా.. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై సుమ మాట్లాడుతూ.. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 7 చూశాను. అందులో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు.. దానికి అర్థం ఏమిటి ?.. అంటూ నాగార్జునను అడగ్గా.. న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూరూల్స్ అంటూ చెప్పుకొచ్చారు నాగ్. దీంతో ఈసారి బిగ్‏బాస్ సీజన్ 7 సరికొత్త ఉండబోతుందనే విషయం మాత్రం ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.