AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ కోసం మరో అందమైన ప్రేమకథ రెడీ.. ఆ డైరెక్టర్‏తో మూవీ చేయనున్న డార్లింగ్ ?..

రాధేశ్యామ్ వంటి ప్రేమకథ తర్వాత రామాయణ ఇతిహాసంతో థియేటర్లలో సందడి చేశారు. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రాజెక్ట్, సలార్ చిత్రాలపైనే ఉన్నాయి. ఇవే కాకుండా అటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్, పోస్టర్ రిలీజ్ చేయలేదు.

Prabhas: ప్రభాస్ కోసం మరో అందమైన ప్రేమకథ రెడీ.. ఆ డైరెక్టర్‏తో మూవీ చేయనున్న డార్లింగ్ ?..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2023 | 7:45 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ నటిస్తోన్న రెండు సినిమాలు సలార్, కల్కి 2898AD సినిమాలపై అంచనాలు ఎక్కువగానే ఉండగా.. ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రెండు సినిమాల గ్లింప్స్, పోస్టర్స్ మరింత హైప్ పెంచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ రెండింటిలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. అయితే చాలా రోజులుగా ప్రభాస్ డిఫరెంట్ స్టోరీస్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాధేశ్యామ్ వంటి ప్రేమకథ తర్వాత రామాయణ ఇతిహాసంతో థియేటర్లలో సందడి చేశారు. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రాజెక్ట్, సలార్ చిత్రాలపైనే ఉన్నాయి. ఇవే కాకుండా అటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్, పోస్టర్ రిలీజ్ చేయలేదు.

ఇవే కాకుండా ప్రభాస్ ఖాతాలో మరో అందమైన ప్రేమకథ చేరబోతుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ అందమైన ప్రేమకథను తెరకెక్కించేది ఎవరనుకుంటున్నారు.. అతనే డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవలే సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హను. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కోసం హను ఓ మంచి లవ్ స్టోరీ సిద్ధం చేసుకున్నారట.

ఇవి కూడా చదవండి

ఇక ఈసినిమా స్టోరీని ప్రభాస్ కు చెప్పడంతో ఆయనకు తెగ నచ్చేసిందని.. కథలో కొన్ని మార్పులు చేసి త్వరలోనే ప్రభాస్ కు ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నారట. అక్టోబర్ 2 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?