AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా ?.. యాక్టింగ్ చూస్తూ ఉండిపోవాల్సిందే..

ముఖ్యంగా అతని సినిమాల కోసం సౌత్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కేలం హీరోయిజం మూవీస్ కాదు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పాత్ర కోసం ఎంతంటి రిస్క్ అయినా చేసేందుకు వెనకడాని నటుడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టగలరా ?.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా ?.. యాక్టింగ్ చూస్తూ ఉండిపోవాల్సిందే..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2023 | 8:44 AM

పైన ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా ?.. దక్షిణాది చిత్రపరిశ్రమలో వెర్సటైల్ యాక్టర్. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన హీరో అతను. నిజానికి అతను తమిళ్ ఇండస్ట్రీకి చెందిన కుర్రాడు.. అయినా తెలుగులోనూ మంచి పాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాల కోసం సౌత్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కేలం హీరోయిజం మూవీస్ కాదు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పాత్ర కోసం ఎంతంటి రిస్క్ అయినా చేసేందుకు వెనకడాని నటుడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టగలరా ?.. అతనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈరోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా సూర్య చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

తమిళ్ చిత్రపరిశ్రమలోని నటుడు శివకుమార్ కుమారుడే సూర్య. 1975 జూలై 23న జన్మించారు సూర్య. ఆయన అసలు పేరు శరవణన్ శివకుమార్. 1997లో విజయ్ దళపతితో కలిసి నెరుక్కు నెర్ సినిమాతో సినీప్రయాణం మొదలుపెట్టారు సూర్య. ఆ తర్వాత 2001లో సూర్య నందా సినిమాతో మరోసారి అడియన్స్ ను మెప్పించారు. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన సూర్య… 2005లో గజిని సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూర్యకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో తెలుగులోనూ సూర్య క్రేజ్ పెరిగిపోయింది. ఆతర్వాత సూర్య నటించిన అన్ని చిత్రాలు తెలుగులోకి డబ్ కావడం స్టార్ట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూర్య… ఇటీవల ఆకాశం నీ హద్దురా, జైభీమ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. చివరగా కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సూర్య పాత్ర హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన వాడివాసల్, కంగువా చిత్రాల్లో నటిస్తున్నారు. సూర్య బర్త్ డే సందర్భంగా విడుదలైన కంగువ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.