Laya: టాలీవుడ్ అందాల తార రీఎంట్రీ.. రామ్ చరణ్ సినిమాలో లయ ?..
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆమెరికాలో నివసిస్తున్నారు. అయితే చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. తెలుగు సినిమా పాటలకు.. ట్రెండింగ్ రీల్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు. కొద్ది రోజులుగా నెట్టింట డ్యాన్సులు చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు లయ. భద్రం కొడుకో సినిమాలో బాలనటిగా కనిపించిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తొలి చిత్రానికి నటిగా మంచి మార్కులు అందుకున్న ఆమె.. ఆ తర్వాత ప్రేమించు, మనసున్న మారాజు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ.. ఇలా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆమెరికాలో నివసిస్తున్నారు. అయితే చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. తెలుగు సినిమా పాటలకు.. ట్రెండింగ్ రీల్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు. కొద్ది రోజులుగా నెట్టింట డ్యాన్సులు చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉన్నారు.
ఇక ఇటీవలే బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో పాల్గొంది లయ. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇప్పుడు లయ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోందట. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అని తెలుస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోన్న చరణ్.. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా.. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.




ఇక బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం మేకర్స్ హీరోయిన్ లయను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. టెస్ట్ సూట్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ కు తగ్గట్టు ఆర్టిస్టులు ఫైనల్ అయిన తర్వాతే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.