Samajavaragamana: ‘సామజవరగమన’ సినిమా మిస్ చేసుకున్న హీరో అతనే.. ఆ మూవీ కోసం మంచి ఛాన్స్ వదిలేశారే..

డైరెక్టర్ రామ్ అబ్బారాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా కనిపించగా.. వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల కీలకపాత్రలలో నటించారు. శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకొడుకులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ భారీగా వసూళ్లు రాబడుతోంది. అలాగే త్వరలోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

Samajavaragamana: 'సామజవరగమన' సినిమా మిస్ చేసుకున్న హీరో అతనే.. ఆ మూవీ కోసం మంచి ఛాన్స్ వదిలేశారే..
Samajavaragamana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2023 | 6:54 AM

ఇటీవల తెలుగు సినీ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యి భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. చిన్న సినిమాగా ఏమాత్రం అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్‏ఫుల్‏గా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అందులో సామజవరగమన ఒకటి. యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో శ్రీవిష్ణు ఖాతాలో మంచి హిట్ పడిందనే చెప్పాలి. డైరెక్టర్ రామ్ అబ్బారాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా కనిపించగా.. వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల కీలకపాత్రలలో నటించారు. శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకొడుకులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ భారీగా వసూళ్లు రాబడుతోంది. అలాగే త్వరలోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ సూపర్ హిట్ సినిమాను ఓ హీరో మిస్ చేసుకున్నారు. అతనేవరో కాదు.. యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ మూవీ ఆఫర్ ముందుగా సందీప్ కిషన్‏కు వచ్చిందట. ఈ కథను 2020లోనే రాజేష్ దండాకు చెప్పారట డైరెక్టర్ రామ్ అబ్బరాజు. కథ నచ్చడంతో ఆయన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర వద్దకు తీసుకెళ్లారట. ఆయనకు కూడా స్టోరీ నచ్చడంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై సంయక్తంగా ఈ సినిమా చేసినట్లు నిర్మాత రాజేష్ దండ తెలిపారు. అలాగే ఈ సినిమాకు ముందుగా సందీప్ కిషన్ ను అనుకున్నామని.. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలతోపాటు.. ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరకపోవడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. దీంతో ఈ సినిమాకు శ్రీవిష్ణును సంప్రదించామని రాజేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే సామజవరగమన సినిమాను వదులుకోవడానికి కారణం మైఖేల్ చిత్రం. రాజేష్ దండా ఈ కథ చెప్పినప్పుడు సందీప్ కిషన్ మైఖేల్ సినిమా చేస్తున్నారట. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన మైఖేల్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, దివ్యాంశ కౌశిక్, గౌతమ్ మీనన్ లాంటి భారీ తారాగణం నటించనప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సామజవరగమన మాత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో సందీప్ కిషన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారంటున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా
7 ఏళ్లల్లో 3 పెళ్లిళ్లు.. విడాకులు.. ఇప్పుడేం చేస్తుందంటే..
7 ఏళ్లల్లో 3 పెళ్లిళ్లు.. విడాకులు.. ఇప్పుడేం చేస్తుందంటే..