Baby Collections: బాక్సాఫీస్‌ వద్ద ‘బేబీ ‘కలెక్షన్ల ఊచకోత.. మహేశ్‌, బన్నీ, ప్రభాస్‌ సినిమాలను దాటేసిందిగా..

బాక్సాఫీస్‌ వద్ద బేబీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతుంది. చిన్న సినిమాగా, ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌కు యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై పది రోజులున్నా థియేటర్లు హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

Baby Collections: బాక్సాఫీస్‌ వద్ద 'బేబీ 'కలెక్షన్ల ఊచకోత.. మహేశ్‌, బన్నీ, ప్రభాస్‌ సినిమాలను దాటేసిందిగా..
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2023 | 3:43 PM

బాక్సాఫీస్‌ వద్ద బేబీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతుంది. చిన్న సినిమాగా, ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌కు యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై పది రోజులున్నా థియేటర్లు హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్నాయి. మొదటి రోజు ఏకంగా రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన బేబీ పదో రోజున కూడా అదే టెంపో కొనసాగిస్తుంది. ఈనేపథ్యంలోనే రికార్డుస్థాయి వసూళ్లతో మేకర్స్‌కు లాభాల పంట పండిస్తోంది బేబీ. ఆదివారం (జులై 24) ఈ మూవీకి మరో .3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తమ్మీద 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్‌ వసూళ్లువచ్చాయి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు   బేబీ దర్శకుడు సాయి రాజేష్‌. అలాగే మూవీ  కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

కాగా మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బేబీ నిలిచింది. మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను, శ్రీమంతుడు, అల్లు అర్జున్‌ సరైనోడు, ప్రభాస్‌ మిర్చి, ఎన్టీఆర్‌ అరవింద సమేత మూవీస్‌ కలెక్షన్లని సైతం బేబీ అధిగమించిందని డైరెక్టర్‌ ఇన్‌స్టా పోస్ట్‌లో షేర్‌ చేశాడు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూబ్యూట్ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సక్సస్‌ టూర్లు నిర్వహిస్తోంది బేబీ చిత్రబృందం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sai Rajesh (@sairazesh)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్