Shiva: శివ సినిమాలో కీలక పాత్ర ఈ స్టార్ నటుడు చేయాల్సిందట.. కానీ వర్మ

1989లో వచ్చిన శివ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాకు తనికెళ్ళ భరణి డైలాగులు రాశారు. మాస్ట్రో ఇళయ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

Shiva: శివ సినిమాలో కీలక పాత్ర ఈ స్టార్ నటుడు చేయాల్సిందట.. కానీ వర్మ
Shiva Movie
Follow us

|

Updated on: Jul 24, 2023 | 3:59 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు శివ. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీలో విలన్ గా నటించిన రఘువరన్ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసారు. 1989లో వచ్చిన శివ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాకు తనికెళ్ళ భరణి డైలాగులు రాశారు. మాస్ట్రో ఇళయ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. శివ సినిమాను 75 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. శివ సినిమా 22 కేద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే 5 కేంద్రాల్లో 175 డేస్ రన్ అయ్యింది ఈ మూవీ.

ఇక శివ సినిమా ఓవర్ ఆల్ గా తెలుగు వర్షన్ 5.8 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఎంపిక చేయాలనీ అనుకున్నారట. ఈ సినిమాలో నాగార్జున, జేడీ చక్రవర్తి, రఘువరన్, అమల పాత్రలు తప్ప మిగిలిన వాళ్ళు అందరు దాదాపు కొత్తవారే.. అయితే విలన్ దగ్గర పని చేసే గణేష్ అనే పాత్ర కోసం  మోహన్ బాబు ను అనుకున్నారట.

అయితే ఇందుకు వర్మ ఒప్పుకోలేదట. అందుకు కారణం కూడా చెప్పారట వర్మ. మోహన్ బాబు స్టైల్ వేరే ఉంటుంది. ఆయన ఆపాత్ర చేస్తే అక్కడ మోహన్ బాబు కనిపిస్తాడు కానీ ఓ రౌడీ కనిపించడు.. కాబట్టి ఆయన వద్దు అని అన్నారట. దాంతో మరో నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. Mohan BabuMohan Babu