AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth: హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా రోషన్‌, రోహన్‌.. ఫొటోస్‌ చూశారా?

శ్రీకాంత్‌ సోదరుడు మేకా అనిల్‌ గతంలో హీరోగానూ నటించాడు. 1999లో 'ప్రేమించేది ఎందుకమ్మా' అనే లవ్‌ స్టోరీలో హీరోగా నటించాడు. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు.

Srikanth: హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా రోషన్‌, రోహన్‌.. ఫొటోస్‌ చూశారా?
Srikanth Family
Basha Shek
|

Updated on: Jul 25, 2023 | 6:06 PM

Share

ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన తమ్ముడు, ప్రముఖ నిర్మాత అనిల్‌ కూతురు పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులందరూ హాజలయ్యారు. శ్రీకాంత్ సతీమణి ఊహ, కుమారుడు హీరో రోషన్, కూతురు మేద, చిన్న కుమారుడు రోహన్ ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కనిపించడంతో ఈ ఫొటోలు అభిమానులు, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా శ్రీకాంత్‌ సోదరుడు మేకా అనిల్‌ గతంలో హీరోగానూ నటించాడు. 1999లో ‘ప్రేమించేది ఎందుకమ్మా’ అనే లవ్‌ స్టోరీలో హీరోగా నటించాడు. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. శ్రీకాంత్‌తో కలిసి విరోధి లాంటి కొన్ని సినిమాలను తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు.

మరోవైపు శ్రీకాంత్‌ వరుసగా సినిమాలు చేస్తున్నారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సపోర్టింగ్స్‌ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి విజయ్‌ వారసుడు సినిమాలో నటించారాయన. ప్రస్తుతం రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కీ రోల్‌ పోషిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్‌ దేవర సినిమాలోనూ నటిస్తున్నారు. ఇక శ్రీకాంత్ వారసుడు రోహన్‌ పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వృషభ అనే పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Srikanth Family

Srikanth Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..