Actress Swathi: విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్‌ స్వాతి.. అప్పుడు కూడా అలాగే చేశానంటూ..

ప్రముఖ నటి కలర్స్‌ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతవారం సోషల్‌ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, అలాగే భర్త వికాస్‌తో కలిసున్న ఫొటోలను డిలీట్‌ చేయడంతో ఒక్కసారిగా స్వాతి డివోర్స్‌ వార్తలు తెరమీదకు వచ్చాయి.

Actress Swathi: విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్‌ స్వాతి.. అప్పుడు కూడా అలాగే చేశానంటూ..
Colours Swathi
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2023 | 8:15 PM

ప్రముఖ నటి కలర్స్‌ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతవారం సోషల్‌ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, అలాగే భర్త వికాస్‌తో కలిసున్న ఫొటోలను డిలీట్‌ చేయడంతో ఒక్కసారిగా స్వాతి డివోర్స్‌ వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇప్పటికే స్వాతి తన భర్తతో డివోర్స్ కోసం కోర్టులో అప్లయ్ చేసిందని, కోర్టు నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చిన తర్వాతనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఇప్పటివరకు స్వాతి కానీ ఆమె భర్త కానీ ఈ డివోర్స్‌ రూమర్స్‌పై స్పందించలేదు. అయితే ఈ విషయంపై ఒక మీడియా సంస్థ స్వాతిని సంప్రదించగా ‘నేను చెప్పడానికి ఏం లేదు. అలాంటివి ఏవైనా ఉంటే నేనే చెబుతాను. 2020లో కూడా ఇలాగే ఫొటోస్‌ డిలీట్‌ చేసినప్పుడు ఇలాంటి రూమర్లే హల్‌చల్‌ చేశాయి. ఫొటోలను ఆర్కైవ్‌లో దాచి పెట్టాను’ అని చెప్పుకొచ్చింది స్వాతి. దీంతో స్వాతి దంపతులపై వస్తోన్న విడాకుల వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీగా చెప్పేసిందీ అందాల తార.

కాగా కలర్స్‌ ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. దీనినే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సుబ్రమణ్యపురం, అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్‌, కార్తికేయ, స్వామిరారా తదితర హిట్‌సినిమాల్లో నటించింది. అన్నట్లు స్వాతి నటనకే కాదు ఆమె వాయిస్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకే పలువురు హీరోయిన్లకు తన గొంతను అరువుగా ఇస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Swathi (@swati194)

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..