- Telugu News Photo Gallery Cinema photos The only heroine who has acted with three mega heroes. Ketika's hopes are all on Bro telugu cinema news
Kethika Sharma: ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. బ్రో సినిమా పైనే కేతిక ఆశలన్నీ..
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసిన ఈబ్యూటీకి ఇండస్ట్రీలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. రొమాంటిక్ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ కేతికకు మాత్రం ఎక్కువగానే క్రేజ్ వచ్చేసింది.
Updated on: Jul 26, 2023 | 1:02 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసిన ఈబ్యూటీకి ఇండస్ట్రీలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. రొమాంటిక్ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ కేతికకు మాత్రం ఎక్కువగానే క్రేజ్ వచ్చేసింది.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఈ సినిమాలు కూడా అంతగా అలరించలేకపోయాయి.

అయితే కేతిక నటించిన సినిమాలు డిజాస్టర్స్ అయినా... ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. ఈ బ్యూటీ గ్లామర్ లుక్స్ తో కట్టిపడేస్తోంది.

ఇక ఇప్పుడు బ్రో సినిమాలో నటించింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది.

అయితే అతి తక్కువ సమయంలోనే ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ కేతిక. ఇప్పుడిదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.

ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. బ్రో సినిమా పైనే కేతిక ఆశలన్నీ..





























