Pawan Kalyan: తేజ్‌ను కోమాలో చూసి తల్లడిల్లిపోయా.. కాపాడిన అబ్దుల్‌ను గుండెల్లో పెట్టుకుంటా: పవన్‌ కల్యాణ్‌

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్నిరోజుల పాటు కోమాలోకి కూడా వెళ్లిపోయాడు. అయితే అభిమానుల ప్రార్థనలు, ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Pawan Kalyan: తేజ్‌ను కోమాలో చూసి తల్లడిల్లిపోయా.. కాపాడిన అబ్దుల్‌ను గుండెల్లో పెట్టుకుంటా: పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2023 | 11:34 AM

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్నిరోజుల పాటు కోమాలోకి కూడా వెళ్లిపోయాడు. అయితే అభిమానుల ప్రార్థనలు, ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే యాక్సిడెంట్‌ తాలూకూ ప్రభావం ఇప్పటికీ తేజ్‌లో కనిపిస్తోంది. అందుకే మళ్లీ సర్జరీకి వెళుతున్నాడు. ఇందుకోసం 6 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నాడు. కాగా తేజ్‌కు యాక్సిడెంట్‌ అవ్వగానే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు కూడా చేశారు. ఈ క్రమంలో యాక్సిడెంట్‌ సమయంలో తేజ్ పరిస్థితిని గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యారు పవన్‌ కల్యాణ్‌. తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన పవన్‌ తన మేనల్లుడు కోమాలో ఉన్నప్పుడు తల్లడిల్లిపోయానన్నారు.

‘ నేను, త్రివిక్రమ్‌ ఉన్నప్పుడు తేజ్‌కు యాక్సిడెంట్‌ అయిందని ఫోన్‌ వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూశాను. అక్కడ సాయి స్పృహలో లేడు. కోమాలోకి వెళ్లిపోయాడు. 24 గంటల తర్వాత మళ్లీ స్పృహలోకి వస్తాడన్నారు వైద్యులు. కానీ ఎంతకూ రాలేదు. అప్పుడు ఆస్పత్రిలో ఓ మూలన కూర్చొని నాలో నేనే గుండెపగిలేలా రోధించాను. తేజ్‌ను బతికించమని జగన్మాత అమ్మవారిని ప్రార్థించాను. అలాంటి తేజ్‌ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే ఆరోజు అతనిని ఆస్పత్రిలో చేర్చిన అబ్బాయే ( అబ్దుల్‌) కారణం. తేజ్ ను ఆస్పత్రిలో చేర్చిన అబ్దుల్ కు ధన్యవాదాలు తెలుపుకుంఉటన్నాను. అతను ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడు’ అని ఎమోషనల్‌ అయ్యారు పవన్‌ కల్యాణ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
ఈ శుక్రవారమే థియేటర్లలోకి పుష్ఫ రాజ్.. అడ్వాన్స్ బుకింగ్ కూడా..
ఈ శుక్రవారమే థియేటర్లలోకి పుష్ఫ రాజ్.. అడ్వాన్స్ బుకింగ్ కూడా..