Nayakudu: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. ‘నాయకుడు’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇటీవలే నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. అయితే అక్కడ హిట్ అయినట్లు.. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Nayakudu: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. 'నాయకుడు' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Nayakudu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2023 | 9:38 AM

తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం మామన్నన్. డైరెక్టర్ మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోలీవుడ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో వడివేలు, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. ఉదయనిధి స్టాలిన్ చివరి చిత్రంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సినీప్రియులు దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇటీవలే నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. అయితే అక్కడ హిట్ అయినట్లు.. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 27 నుంచి అందుబాటులో ఉంటుందని ఇటీవలే ప్రకటించింది. ఇక ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

కథ విషయానికి వస్తే.. మామన్నన్ (వడివేలు) చాలా మంచి వ్యక్తి. అణాగారిన వర్గానికి చెందిన అతను ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తుంటారు. ఇక అతని కొడుకు వీరన్ (ఉదయనిధి ) చాలా అభ్యుదయ భావాలు ఉన్న యువకుడు. కుల వ్యవస్థ వల్ల చిన్నప్పటి నుంచే అనేక అవమానాలు ఎదుర్కొంటాడు. ఇక లీలా (కీర్తి సురేష్)ను అగ్రకులానికి చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) వేధిస్తుంటాడు. ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన మామన్నన్, వీరన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది మామన్నన్ చిత్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు