Sai Dharam Tej: 12రోజులు కోమాలో ఉన్నాను.. పవన్ మావయ్య రోజూ నా దగ్గరకు వచ్చి.. సాయి ధరమ్ తేజ్..

డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై 28న విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో జూలై 25న సాయంత్రం నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‏తోపాటు.. వరుణ్ తేజ్, వైష్ణవి తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ తన బైక్ యాక్సిడెంట్ గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

Sai Dharam Tej: 12రోజులు కోమాలో ఉన్నాను.. పవన్ మావయ్య రోజూ నా దగ్గరకు వచ్చి.. సాయి ధరమ్ తేజ్..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2023 | 6:58 AM

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన లేటేస్ట్ సినిమా బ్రో. ఇందులో తేజ్ ప్రధాన పాత్రలో నటించగా..పవన్ ముఖ్య పాత్ర పోషించాడు. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై 28న విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో జూలై 25న సాయంత్రం నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‏తోపాటు.. వరుణ్ తేజ్, వైష్ణవి తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ తన బైక్ యాక్సిడెంట్ గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కథ విని ఓకే చెప్పిన కొద్దిరోజులకే తాను ప్రమాదానికి గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు తేజ్.

“ఈ సినిమా కోసం పవన్ మావయ్య నాకు ఫోన్ చేసి.. ఈ క్యారెక్టర్ చేయాలని అన్నారు.. కానీ నేను ఈ రోల్ చేయడమా.. ఇది కలా నిజమా అనుకున్నాను. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత నాకు ప్రమాదం జరిగింది. దాదాపు 12 రోజులు కోమాలో ఉంటే ప్రతి రోజు ఉదయం షూటింగ్‏కు వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చి మావయ్య వెళ్తుండేవాడు. నా చెయ్యి పట్టుకుని నీకేం కాదురా అంటూ ధైర్యం చెప్పి వెళ్లేవారు. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. ఈ సినిమా అభిమానులంతా గర్వంగా కాలరెగరేసుకుని తొడకొడుతూ థియేటర్ నుంచి వెళతారు. మావయ్య నేను బయట ఎలా ఉంటామో అలాగే తెరపై కనిపిస్తాము. నా గురువు, నా మావయ్య, బ్రో.. ఈ ఛాన్సిచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్. ఈ స్టేజ్ మీదకు రావడానికి కారకులైన మా ముగ్గురు మావయ్యలకు ఎప్పుడూ తలొంచి ఉంటాను ” అంటూ చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నారు పవన్. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.