Tamannah: ప్రపంచంలోనే 5వ అతిపెద్ద డైమండ్ రింగ్  తమన్నా సొంతం.. ఖండించిన మిల్కీబ్యూటీ.. 

ఆమె లవ్ స్టోరీ దగ్గర్నుంచి డైమండ్ రింగ్ వరకు అనేక విషయాల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల తమన్నా దగ్గర అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ ఉందని.. అది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రం అని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. 2019లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో మిల్కీబ్యూటీ అద్భుతమైన నటనకు

Tamannah: ప్రపంచంలోనే 5వ అతిపెద్ద డైమండ్ రింగ్  తమన్నా సొంతం.. ఖండించిన మిల్కీబ్యూటీ.. 
Tamannaah Diamond Ring
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2023 | 8:26 AM

సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‏గా ఫుల్ ఫాంలో ఉంది తమన్నా. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే.. మరోవైపు డిజిటల్ ఫ్లాట్ ఫాంపై ఆకట్టుకుంటుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే మిల్కీబ్యూటీ గురించి కొద్ది రోజులుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె లవ్ స్టోరీ దగ్గర్నుంచి డైమండ్ రింగ్ వరకు అనేక విషయాల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల తమన్నా దగ్గర అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ ఉందని.. అది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రం అని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. 2019లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో మిల్కీబ్యూటీ అద్భుతమైన నటనకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ముగ్దురాలైనందని.. దీంతో తమన్నాకు డైమంగ్ రింగ్ బహుమతిగా ఇచ్చారని వార్తలు వినిపించాయి. ఆ వజ్రం ఉంగరం ధర దాదాపు రూ.2 కోట్లు అని.. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద డైమండ్ అంటూ ప్రచారం నడిచింది. తాజాగా ఈ వార్తలపై స్పందించింది తమన్నా. తన గురించి చక్కర్లు కొడుతున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపింది.

వజ్రంలాంటి ఆ ఆభరణాన్ని చేతికి ధరించిన ఆ ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఈ విషయం ఇలా మీకు చెప్పడానికి చాలా బాధపడుతున్నాను.. ఆరోజు మేము కేవలం బాటిల్ ఓపెనర్‏తో ఫోటో షూట్ చేశాం.. నేను వేలికి ధరించినది నిజమైన వజ్రం కాదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె స్టోరీ చూసి అభిమానులతోపాటు నెటిజన్స్ షాకవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మిల్కీబ్యూటీ మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మిల్కీబ్యూటీ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలోనే తమన్నా కథానాయిక. ఈ రెండు సినిమాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.