Devara: ‘యాక్షన్.. ఎమోషనల్.. పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్’.. దేవరపై ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..

తెలుగులో తొలి చిత్రం.. అలాగే తాను ఎంతగానో అభిమానించే తారక్ సరసన ఛాన్స్ రావడంతో ఈ మూవీపై జాన్వీ సైతం ఎంతో ఎగ్జైటింగ్‏గా ఉంది.  ఇక ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ఎప్పటికప్పుడు మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఫిల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Devara: 'యాక్షన్.. ఎమోషనల్.. పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్'.. దేవరపై ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..
Devara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2023 | 8:54 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీస్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న చిత్రం దేవర. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఆచార్య డిజాస్టర్ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఎలాగైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ . ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. తెలుగులో తొలి చిత్రం.. అలాగే తాను ఎంతగానో అభిమానించే తారక్ సరసన ఛాన్స్ రావడంతో ఈ మూవీపై జాన్వీ సైతం ఎంతో ఎగ్జైటింగ్‏గా ఉంది.  ఇక ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ఎప్పటికప్పుడు మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఫిల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారంట. ఇందులో యాక్షన్ తోపాటు.. ఎమోషనల్ అలాగే.. పవర్ ఫుల్ ఎలిమెంట్స్‏కు చాలా ప్రాధాన్యత ఇచ్చారట. ముఖ్యంగా ఈ చిత్రంలో తారక్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. ఇందులో తండ్రి పాత్రలోనూ తారక్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా ఉండే బ్లాక్ గా ఉంటుందని.. దీనిని కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నారని టాక్ నడుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ మూవీ కూడా సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుందట. కంప్లీట్ గా ఫిక్షనల్ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లోనే దేవర కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. మొత్తానికి విజువల్ ఎఫెక్ట్స్‏తో ప్రేక్షకులకు పుల్ థ్రిల్ కలిగించేందుకు రెడీ అవుతున్నారట కొరటాల. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో మరో విలన్ గా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ సినిమా తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.