Sobhita Dhulipala: ఓటీటీలోకి వచ్చేస్తోన్న శోభిత ధూళిపాళ వెబ్ సిరీస్.. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
శోభిత ధూళిపాళ తారా ఖన్నా పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్. ఇందులో ఆమె నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. 2019లో మార్చి 8న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత కీలకపాత్రలలో నటించారు. దీనికి శ్రీవాత్సవ దర్శకత్వం వహించగా..
అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది శోభితా ధూళిపాళ. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. బీటౌన్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. వెండితెరపైనే కాదు.. ఇటు ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. శోభిత ధూళిపాళ తారా ఖన్నా పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్. ఇందులో ఆమె నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. 2019లో మార్చి 8న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత కీలకపాత్రలలో నటించారు. దీనికి శ్రీవాత్సవ దర్శకత్వం వహించగా.. అప్పట్లో ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సిరీస్ సెకండ్ పార్ట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చాలా కాలం తర్వాత మేడ్ ఇన్ హెవెన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ఈ సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండో సీజన్ ప్రసారం కానుందని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తానికి అధికారికంగా విడుదల తేదీ చెప్పేశాం. షాదీ బిజినెస్ చూసేందుకు మరోసారి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చింది శోభిత ధూళిపాళ.
ఇక శోభిత పోస్ట్ పై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఎట్టకేలకు మేడ్ ఇన్ హెవెన్ సెకండ్ పార్ట్ రావడం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్ లో కొత్త నటీనటులు కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.