Mohammed Siraj: 70 రూపాయలతో మొదలై 7 కోట్ల వరకు.. మారిపోయిన హైదరాబాదీ పేసర్‌ జాతకం

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడీ స్పీడ్‌స్టర్‌. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించేది. టీమిండియా గెలుపు సాధించలేకపోవచ్చు.. కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Mohammed Siraj: 70 రూపాయలతో మొదలై 7 కోట్ల వరకు.. మారిపోయిన హైదరాబాదీ పేసర్‌ జాతకం
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2023 | 10:59 AM

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడీ స్పీడ్‌స్టర్‌. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించేది. టీమిండియా గెలుపు సాధించలేకపోవచ్చు.. కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టెస్టు కెరీర్‌లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా బీసీసీఐ త్వరలోనే వార్షిక కాంట్రాక్టును ప్రకటించనుంది. ఈక్రమంలో మహ్మద్ సిరాజ్ ప్రమోషన్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు సిరాజ్‌. ముఖ్యంగా గత ఏడాది నుంచి అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది అతని ఖాతాలో ముప్పైకి పైగా వికెట్లు ఉన్నాయి. దీంతో బీసీసీఐ అతడిని ‘ఏ+’ కేటగిరీలోకి తీసుకొవచ్చని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అతని కాంట్రాక్ట్ రూ.7 కోట్లు. ఇది కాకపోయినా ‘ఏ’ కేటగిరీ ఇస్తే 5 కోట్లు వస్తాయి. ప్రస్తుతం సిరాజ్‌ ‘బి’ గ్రేడ్‌లో రూ. 3 కోట్లు అందుకుంటున్నాడు. ఈ ఏడాది మహమ్మద్ సిరాజ్ ప్రమోషన్ ఫిక్స్ కావడం ఖాయం.

70 రూపాయలతో మొదలై..

కాగా ఒకప్పుడు మహ్మద్ సిరాజ్‌కి మ్యాచ్ ఆడితే 70 రూపాయలు మాత్రమే వచ్చేవట. ఆర్థికంగా బాగా వెనుకబడిన నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు సిరాజ్. తన చిన్నతనంలో క్రికెట్ ఆడినందుకు చాలా తిట్లు తినాల్సి వచ్చింది. రహస్యంగా క్రికెట్ ఆడాల్సి వచ్చింది. అయితే మామ సాయంతో క్రికెట్‌ మ్యాచ్‌లకు వెళ్లేవాడు. అప్పట్లో మ్యాచ్ ఆడితే సిరాజ్ కు 70 రూపాయలు వచ్చేవట. అయితే ఇందులో 60 రూపాయలు పెట్రోల్‌కే ఖర్చు అయ్యేవి. ఇక బైక్ పంక్చర్ అయితే ఏమి మిగిలేవి కావట.

ఇవి కూడా చదవండి

బుమ్రా స్థానంలో…

ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ స్థిరంగా రాణించడంలేదు. పైగా గాయాలతో సతమతమవుతున్నారు. ఈక్రమంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌కు సిరాజే నాయకత్వం వహిస్తున్నాడు. ఇక రేపటి నుంచి విండీస్‌తో భారత్‌ వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచకప్‌ దృష్ట్యా ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో జరిగే మ్యాచ్‌లన్నీ చాలా కీలకం. ఈ క్రమంలో సిరాజ్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..