World Cup 2023: భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. కొత్త డేట్ ఇదే.. మార్పునకు కారణమేంటంటే?

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్రాడ్‌కాస్టర్లకు సమస్యలు తలెత్తవచ్చు. కాగా మ్యాచ్‌ రీషెడ్యూల్‌ విషయాన్ని..

World Cup 2023: భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. కొత్త డేట్ ఇదే.. మార్పునకు కారణమేంటంటే?
India Vs Pakistan
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2023 | 9:19 AM

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ తేదీ మారవచ్చు. ఈ మ్యాచ్‌ని మళ్లీ రీషెడ్యూల్ చేయవచ్చు. దీనికి ప్రధాన కారణం దేవీ నవరాత్రులు. అక్టోబర్‌ 15 నుంచే నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి సందర్భంగా గుజరాత్ అంతటా గర్బా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అదే రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. ఇప్పుడీ విషయాన్నే బీసీసీఐ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బ్రాడ్‌కాస్టర్లకు సమస్యలు తలెత్తవచ్చు. కాగా మ్యాచ్‌ రీషెడ్యూల్‌ విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవరాత్రుల సమయంలో భారత్‌-పాకిస్థాన్‌ వంటి హై ప్రొఫైల్‌ మ్యాచ్‌లు నిర్వహించడం సమస్యలు తలెత్తవచ్చని భద్రతా సంస్థలు కూడా హెచ్చరించాయని ఆయన తెలిపారు.

త్వరలోనే నిర్ణయం..

గత నెలలోనే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లక్ష మంది ప్రేక్షకులతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు ఇక్కడ మరో 3 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఇందులో న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్‌లోని 10 నగరాల్లో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు. మరోవైపు ప్రపంచకప్‌ను నిర్వహించే అన్ని క్రికెట్ సంఘాలకు బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాస్తూ జూలై 27న ఢిల్లీలో సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ భేటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై చర్చ జరుగుతుందని, ఈ హై ప్రొఫైల్‌ మ్యాచ్ కొత్త తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..