- Telugu News Photo Gallery Cinema photos Tollywood top five entertainment updates like Prabhas Kalki, Jr NTR Devara
Tollywood: శంకర్ పల్లిలో ప్రభాస్.. శంషాబాద్‌లో దేవర.. టాలీవుడ్ టాప్ 5 మూవీ అప్డేట్స్ ఇవే..
కళ్లు మూసి తెరిచేలోపు వారం అయిపోయింది.. మరో మండే వచ్చేసింది.. అలా సోమవారం వచ్చిందంటే ఏ హీరో ఎక్కడున్నారు.. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడానికి మన ఈటీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మన షూటింగ్ అప్‌డేట్స్‌లోకి వెళ్లిపోదాం.. మన హీరోలు, వాళ్ల సినిమాల ముచ్చట్లు తెలుసుకుందాం..! అమెరికా నుంచి వచ్చీ రాగానే ప్రాజెక్ట్ కే షూటింగ్‌తో బిజీ అయిపోయారు ప్రభాస్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. దీంతో పాటు మారుతి సినిమాకు కూడా డేట్స్ ఇచ్చారు ప్రభాస్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Basha Shek
Updated on: Aug 01, 2023 | 10:11 PM

కళ్లు మూసి తెరిచేలోపు వారం అయిపోయింది.. మరో మండే వచ్చేసింది.. అలా సోమవారం వచ్చిందంటే ఏ హీరో ఎక్కడున్నారు.. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడానికి మన ఈటీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మన షూటింగ్ అప్‌డేట్స్‌లోకి వెళ్లిపోదాం.. మన హీరోలు, వాళ్ల సినిమాల ముచ్చట్లు తెలుసుకుందాం..!

అమెరికా నుంచి వచ్చీ రాగానే ప్రాజెక్ట్ కే షూటింగ్‌తో బిజీ అయిపోయారు ప్రభాస్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. దీంతో పాటు మారుతి సినిమాకు కూడా డేట్స్ ఇచ్చారు ప్రభాస్. మహేష్ బాబు ఫారెన్ వెళ్లడంతో ప్రస్తుతానికి గుంటూరు కారం షూటింగ్ నెమ్మదిగా జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుంది

పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆయన సినిమాలేవీ ప్రస్తుతం సెట్స్‌పై లేవు. ఓజి కూడా ఈ మధ్యే భారీ షెడ్యూల్ పూర్తి చేసారు సుజీత్. అలాగే పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. త్వరలోనే ఫారెన్‌లో రెండో షెడ్యూల్ జరగనుంది. ఇక భగవంత్ కేసరీ సినిమా కోసం బాలయ్య, కాజల్, శ్రీలీలపై RFCలోని ఓ భారీ సెట్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ షూట్ చేస్తున్నారు.

వెంకటేష్ సైంధవ్ షూటింగ్ BHELలో జరుగుతుండగా.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు శంషాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ నేరేడ్‌మెట్‌లో నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తున్నారు.

ఇక గోపీచంద్ భీమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది. ఇక ఆగస్ట్ 5 నుంచి పుష్ప 2 న్యూ షెడ్యూల్ మారేడుమిల్లిలో.. ఆగస్ట్ 20 నుంచి హైదరాబాద్‌లో హాయ్ నాన్న షెడ్యూల్స్ మొదలు కానున్నాయి.





























