Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantras for Happiness: కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే జపించాల్సిన మంత్రాలు..

సనాతన సంప్రదాయం ప్రకారం మంత్రం సాహిత్యపరమైన అర్థం మనస్సును ఒక వ్యవస్థలో బంధించడం. కొన్నిసార్లు మన మనస్సులో అనేక తప్పుడు ఆలోచనలు వస్తాయి.. దీని కారణంగా మనస్సు అనవసరంగా విచారంగా మారుతుంది. వివిధ రకాల చింతలతో నిండి పోతుంది. అంతేకాదు ఈ పరిస్థితిలో ఈ మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి. 

Mantras for Happiness: కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే జపించాల్సిన మంత్రాలు..
Powerful Mantras
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2023 | 7:35 AM

ఒక వ్యక్తి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించినప్పుడు.. లేదా పూజాదికార్యక్రమాలను మంత్రాలు పఠించడం హిందూ సంప్రదాయంలో ఆచారం. ఈ మంత్రాలతో శుభం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. కాగా శాస్త్రాల్లో అనేక రకాల మంత్రాల శక్తిని ప్రస్తావిస్తూ..శ్రద్దా విశ్వాసంతో మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. మీ కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే ఏఏ మంత్రాలను జపిస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..

సనాతన సంప్రదాయం ప్రకారం మంత్రం సాహిత్యపరమైన అర్థం మనస్సును ఒక వ్యవస్థలో బంధించడం. కొన్నిసార్లు మన మనస్సులో అనేక తప్పుడు ఆలోచనలు వస్తాయి.. దీని కారణంగా మనస్సు అనవసరంగా విచారంగా మారుతుంది. వివిధ రకాల చింతలతో నిండి పోతుంది. అంతేకాదు ఈ పరిస్థితిలో ఈ మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి.

ఆపదలు తొలగించే మంత్రాలు

సూర్య మంత్రం

ఇవి కూడా చదవండి

ఓం సూర్య దేవాయ నమః : ఈ మంత్రాన్ని ఉదయాన్నే జపించాలి. ఈ సమయంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసి.. ఒక  పాత్ర తీసుకుని ఎర్రటి పువ్వులు,  అక్షతలు, కొద్దిగా బెల్లం వేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించి.. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. సూర్య భగవానుడు ఆనందం , శ్రేయస్సునిచ్చే  దేవుడుగా పరిగణించబడతాడని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తీరిపోతాయి.

శివయ్యకు సంబంధించిన మంత్రం

శివలింగంపై నీరు, బిల్వ పత్రాలను సమర్పించే సమయంలో ఈ మంత్రాన్ని ‘ఓం నమః శివయ’ జపించండి. దీనితో పాటు, మీరు రుద్రాక్ష జపమాలతో జపించండి. ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఆందోళన లేని జీవితం లభిస్తుంది.

బజరంగబలి మంత్రం

ఒక వ్యక్తికి ఏ విధమైన భయం, ఆందోళన తొలగాలన్నా..  ఏదైనా పనిలో విజయం సాధించాలంటే.. ప్రతిరోజూ ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. శనివారం రోజున 551 సార్లు ఎర్రచందనం జపమాలతో  జపిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల అన్ని రకాల దుఃఖ, కష్టాలు నశిస్తాయి.

శ్రీరాముని మంత్రం

శ్రీరామ్, జై రామ్, జై జై రామ్, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో రామ నామంతో ఈ మంత్రాన్ని పఠిస్తారు. ఈ రామనామం మంత్రం మీ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. దీనితో పాటు మీకు అన్ని రకాల ఆందోళనల నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాదు మీరు మీ మనస్సులో వచ్చే అన్ని రకాల ప్రతికూల ఆలోచనలను కూడా వదిలించుకుంటారు.

తినే ముందు జపించాల్సిన మంత్రం

సనాతన సంప్రదాయంలో భోజనం చేసే ముందు మంత్రాలను జపించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది దేవుని మనకు అందించిన ఆహారానికి కృతజ్ఞతను తెలియజేస్తుంది. ఎవరైనా తినడానికి ముందు మంత్రాన్ని జపిస్తూ.. ఆహారం అందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇందులో ఓం సః నవవతు । సః నౌ భునక్తు । సః వీర్యం కరవావహై । తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై  ఓం శాంతి: శాంతి: శాంతి: అనే మంత్రాన్ని జంపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)