- Telugu News Photo Gallery Spiritual photos Travel Tips: Andhra Pradesh famous temple known in detail in Telugu
Travel Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధి పురాతన మహిమ గల క్షేత్రాలు.. అద్భుత కళాసంపదకు నెలవు
కొంతమందికి పర్వతాలు మంచు కొండలు, మైదానాలను సందర్శించడానికి ఇష్టపడితే.. మరికొందరికి పచ్చని అడవులు, నదులను పర్యటించడానికి ఇష్టపడతారు.. మరి కొందరు దేవాలయాలకు వెళ్లడానికి లేదా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు. సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడంలో కూడా ఒక విభిన్నమైన అనుభవం. ఈ ప్రదేశాల్లో వ్యాపించే సానుకూలత మనస్సును ప్రశాంతపరుస్తుంది. హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అందమైన, పురాతన ఆలయం ఉంది. ఈ దేవాలయాలు విశ్వాసానికి కేంద్రంగా మాత్రమే కాకుండా వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణలుగా నిలుస్తాయి.
Updated on: Aug 05, 2023 | 12:46 PM

మన దేశంలో అడగుగునా గుడి ఉంది.. అన్న చందంగా ఆ సేతుహిమాచలం ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో అత్యంత పురాతన దేవాలయాలున్నాయి. వాటిల్లో ఒకటి ఆంధ్ర ప్రదేశ్, దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. చారిత్రక, సాంస్కృతిక కళలను చూడాలనుకుంటే.. పురాతన దేవాలయాలను ఇక్కడ చూడవచ్చు. చాలా అందమైన ప్రదేశాల్లో ఈ ఆలయాలను పురాతన కాలంలో నిర్మించారు. మీరు ఏదైనా పురాతన ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే లేదా మీ కుటుంబంతో ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ దేవాలయాలను సందర్శించండి.

రంగనాథ దేవాలయం: నెల్లూరులో ఉన్న అత్యంత పురాతన దేవాలయం తల్పగిరి రంగనాథస్వామి ఆలయం లేదా రంగనాయకుల ఆలయ. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. అద్భుతమైన శిల్పకళా సంపదతో చూపరులను, కళాభిమానులు ఆకర్షిస్తుంది.

వెంకటేశ్వర దేవాలయం: ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు ప్రపంచ ఖ్యాతిగాంచిన క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి భక్తులు దర్శించుకుంటారు.

కనక దుర్గ గుడి: కృష్ణమ్మ ఒడ్డున విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారిని దుర్గమ్మగా భావించి కొలుచుకుంటారు. ఈ ఆలయం పాండవుల మధ్యముడు అర్జునుడి నిర్మించినట్లు ప్రజలు నమ్ముతారు.

మల్లికార్జున జ్యోతిర్లింగం: నల్లమల అడవుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. శివుని 12 జ్యోతిర్లింగాల్లో మల్లికార్జున దేవాలయం ఒకటి. శివపార్వతులు ఆలయంలో మల్లన్న బ్రమరాంబలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. దీనిని శ్రీ క్షేత్రంగా పిలుస్తారు.





























