- Telugu News Photo Gallery Spiritual photos Garud Puran: One hour before the death gets realized, these 5 things start appearing
Garud Puranam: ఈ ఐదు విషయాలు కనిపిస్తే జీవితం చివరి క్షణంలో ఉందని పేర్కొన్న గరుడ పురాణం..
గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితపు చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే మరణానికి చేరుకున్నప్పుడు సరిగ్గా ఏమి గ్రహిస్తాడనే దాని గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలోని చివరి క్షణాలు ఎలా జరుగుతాయో ఈ రోజు తెలుసుకోండి..
Updated on: Aug 05, 2023 | 2:01 PM

జనన మరణాలు ఎప్పటికీ ముందుగా తెలియవు. మనిషీ రెండింటిపై ఎన్నడూ పై చేయి సాధించలేడు. జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు.. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేది అమూల్యమైన సత్యం. జనన మరణ చక్రం అనేక ముఖ్యమైన అంశాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి.

గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితపు చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే మరణం అంచుకు చేరుకున్న సమయంలో ఖచ్చితంగా ఏమి గ్రహిస్తాడనే దాని గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలోని చివరి క్షణాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకున్నప్పుడు, అతను తన చుట్టూ ఉన్న పూర్వీకులను చూడటం ప్రారంభిస్తాడు. ప్రపంచాన్ని విడిచిపెట్టిన తనవారి ఆత్మలను అతను చూస్తాడు. అప్పుడు తనను.. తన వారు పిలుస్తున్నట్లు భావిస్తారు. మరణం ఆసన్నమైన వారికి మాత్రమే తమ పూర్వీకులను చూడగలరని నమ్ముతారు. అంతే కాదు.. మరణం అంచున ఉన్న వ్యక్తి ద్వారా పూర్వీకులు తమ చివరి కోరికలను కుటుంబానికి తెలియజేయవచ్చు.

గరుడ పురాణం ప్రకారం ఒకరు తన చివరి శ్వాస తీసుకునే సమయంలో ఒక రహస్యమైన తలుపు తెరుచుకున్నట్లు ఫీల్ అవుతారు. ఆ తలుపు నుండి తీవ్రమైన కాంతి కిరణాలు వెలువడుతాయని నమ్ముతారు. కొంతమంది ఆ తలుపు నుండి ప్రసరిస్తున్న కాంతివంతమైన వెలుగు రేఖలను చూస్తారని కూడా పేర్కొన్నారు. రోగి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ముందు అలాంటి దృశ్యాన్ని చూసినట్లు చెబితే అతను త్వరగా తమను విడిచిపెడుతున్నాడని కుటుంబం గ్రహించాలి.

జీవితపు చివరి క్షణాల్లో భయంకరంగా కనిపించే ఒక నల్ల మనిషిని చూస్తాడు. అతను నిజానికి యముడు. ఆ వ్యక్తి ఆత్మను తనతో తీసుకెళ్లేందుకు యమధర్మ రాజు వచ్చినట్లు భావించాలి. ఒక వ్యక్తి తన చుట్టూ యమ దేవదూతలు ఉన్నట్లు భావిస్తే అతడు తుది శ్వాస విడిచే సమయం ఆసన్నం అయిందని పేర్కొన్నారు. ఇది జరిగినప్పుడు, చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది.

మృత్యువు వచ్చినట్లు నీడ కూడా తెలియస్తుందని నమ్మకం. అయితే ఇది నిజంగా నోటి మాట కాదు. మనిషి చివరి దశలో అతను నీటిలో, అద్దం లేదా నూనెలో తన ప్రతిబింబం లేదా నీడను చూడలేడు. ఇది జరిగితే, మరణం ఆసన్నమైందని మీరు అర్థం చేసుకోవాలి.

మనిషి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు, అతనికి అకస్మాత్తుగా తాను చేసిన మంచి, చెడు పనులను గుర్తు చేసుకుంటారు. చివరి క్షణాల్లో తన మనసులో ఉండే కోరికలను కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. జీవితంలో ఎవరితోనూ పంచుకోని విషయాలను ఆ వ్యక్తి ఎవరికైనా చెప్పినప్పుడు, ఓపికగా విని అతని చివరి కోరికను తీర్చాలని పేర్కొంది.





























