Dreaming About Snakes: శ్రావణ మాసంలో పాములు కనిపిస్తున్నాయా.. పాము రంగును బట్టి కలల ఫలితాలు.. వాటి అర్ధం ఏమిటంటే..

ఒక వ్యక్తి తన కలలో తెల్లటి పాము కనిపిస్తే.. శివుడు అతనిని ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఆకుపచ్చ పామును చూడటం శుభవార్తను సూచిస్తుంది. బంగారు పాము కలలో కనిపిస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని..  పసుపు రంగు పామును చూడటం వృత్తి , వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, కలలో పట్టుకున్న పాము కనిపించినా లేదా బిలంలోకి వెళ్తున్నట్లు కనిపించినా ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు వస్తుంది.

Dreaming About Snakes: శ్రావణ మాసంలో పాములు కనిపిస్తున్నాయా.. పాము రంగును బట్టి కలల ఫలితాలు.. వాటి అర్ధం ఏమిటంటే..
Dreaming About Snakes
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2023 | 9:39 AM

ప్రతి వ్యక్తి జీవితంలో తిండి, నిద్ర ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. అలసి ఆదమరచి నిద్ర పొతే ఆ నిద్రలో కలలు కంటారు. అలా కలలో కొన్ని సార్లు ఆకాశాన్ని, పారుతున్న నదులను, వివిధ రకాల జంతువులు, పక్షులను ఇంకా చెప్పాలంటే.. ఈ ప్రపంచంలో లేని సన్నివేశాలను కూడా తన కలలో చూస్తాడు. డ్రీమ్ సైన్స్ ప్రకారం  కలలో కనిపించే ప్రతిదానికీ దాని సొంత సంకేతం లేదా అర్థం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో ఎవరి కాలోనైనా పదే పదే నాగదేవత కలలో కనిపిస్తే.. ఆ కలలకు అర్థం ఏమిటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం..

పాము కలలు.. దాని సంకేతాలు..

సనాతన సంప్రదాయంలో, పాము లేదా సర్పం మహాదేవుడు మెడలో ఆభరణం. శ్రావణ మాసంలో లేదా నాగపంచమి రోజున ఎవరి కలలోనైనా పాము కనిపిస్తే.. దానిని శుభసూచకంగా భావించాలని నమ్ముతారు. ముఖ్యంగా కలలో ఒక పాము తన సర్పాన్ని లేపినట్లు కనిపిస్తే.. అలాంటి కల చాలా శుభప్రదమైనది.  ఎందుకంటే ఈ కల భవిష్యత్తులో మీరు భూమి, భవనం, పూర్వీకులకు చెందిన ఆస్తి కలిసి వచ్చి ఆనందాన్ని పొందుతారని సూచిస్తుంది.

పాము రంగును బట్టి కలల ఫలితాలు

ఒక వ్యక్తి తన కలలో తెల్లటి పాము కనిపిస్తే.. శివుడు అతనిని ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఆకుపచ్చ పామును చూడటం శుభవార్తను సూచిస్తుంది. బంగారు పాము కలలో కనిపిస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని..  పసుపు రంగు పామును చూడటం వృత్తి , వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, కలలో పట్టుకున్న పాము కనిపించినా లేదా బిలంలోకి వెళ్తున్నట్లు కనిపించినా ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. కలలో చనిపోయిన పాము కనిపిస్తే.. అతనికి బాధల నుంచి ముగింపు లభిస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

స్పప్న శాస్త్రం ప్రకారం..

సప్న శాస్త్రం ప్రకారం ఎవరికైనా నిరంతరం కలలో పాము కలిపిస్తే అది శుభసూచకం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది జాతకంలో కాలసర్ప దోషం, రానున్న ఏదైనా పెద్ద సమస్య .. దాని నుంచి వచ్చే బాధలను సూచిస్తుంది. కలలో పాము పదేపదే కనిపించడం కూడా మీ పూర్వీకుల అసంతృప్తిని లేదా వారి అసంతృప్తిని సూచిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చాలా పాములను చూడటం లేదా పాము కాటువేయడం భవిష్యత్తులో మీకు ఏదైనా పెద్ద విపత్తు లేదా వ్యాధి మొదలైన వాటిని సూచిస్తుంది.

డ్రీమ్ థీరీ ప్రకారం ఒక పాము రంధ్రం లోపలికి వెళ్లడం శుభపరిణామం, అయితే పాము రంధ్రం నుండి బయటకు వస్తే.. అది భవిష్యత్తులో కొన్ని పెద్ద ఇబ్బందులను సూచిస్తుంది. కలలో నల్ల పామును చూడటం కూడా అశుభం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)