Sneezing Astro Tips: అన్ని తుమ్ములు అశుభాలు కావు… తుమ్మితే లాభనష్టాల గురించి విదేశాల్లో కూడా నమ్మకమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుమ్ములు రావడం వల్ల ఏ పనిలోనైనా ఆటంకాలు లేదా ఇబ్బంది దాగి ఉంటుందనే భావన ప్రజలకు ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుమ్మడం వల్ల వచ్చే శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాయి. తుమ్ములు వచ్చే సంఖ్యను బట్టి అదృష్ట, దురదృష్టానికి ప్రధాన కారణమని భావిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు, ఎవరైనా మీ ముందు తుమ్మినట్లయితే, ఆ తుమ్ము మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.

Sneezing Astro Tips: అన్ని తుమ్ములు అశుభాలు కావు... తుమ్మితే లాభనష్టాల గురించి విదేశాల్లో కూడా నమ్మకమే..
Sneeze In India
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2023 | 9:00 AM

తుమ్ములు సర్వ సాధారణంగా అందరికి వస్తూనే ఉంటాయి. జలుబు, ఫ్లూ కారణంగా మాత్రమే కాదు దుమ్ము ధూళి వంటివి వచ్చినప్పుడు కూడా తుమ్ములు రావడం సర్వ సాధారణం. అయితే మనదేశంలో ముఖ్యంగా హిందువులు తుమ్మలను శుభా, అశుభలకు కారకాలగా పరిగణిస్తారు. అయితే తుమ్ములను శుభ సూచకం, అశుభ సూచకంగా భారతీయులు మాత్రమే కాదు.. అనేక దేశాల్లో కూడా పరిగణిస్తారు. ఉదాహరణకు ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మినప్పుడు, పని చెడిపోయే అవకాశం ఉంది, లేదా ఏదైనా శుభ కార్యం పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్ముతారు. అయితే సాధారణంగా వచ్చే ప్రతి తుమ్ము చెడ్డది కాదని మీకు తెలుసా?

అదృష్టాన్ని కలిగించే తమ్ములు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుమ్ములు రావడం వల్ల ఏ పనిలోనైనా ఆటంకాలు లేదా ఇబ్బంది దాగి ఉంటుందనే భావన ప్రజలకు ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుమ్మడం వల్ల వచ్చే శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాయి. తుమ్ములు వచ్చే సంఖ్యను బట్టి అదృష్ట, దురదృష్టానికి ప్రధాన కారణమని భావిస్తారు.

  1. హిందూ విశ్వాసం ప్రకారం మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు, ఎవరైనా మీ ముందు తుమ్మినట్లయితే, ఆ తుమ్ము మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
  2. మీరు ఏదైనా పని చేయబోతుంటే.. ఎవరైనా ఒకే సమయంలో వరుసగా రెండుసార్లు తుమ్మినట్లయితే, అది దురదృష్టానికి బదులుగా అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు. అప్పుడు చింతించకుండా చేపట్టిన పనిని కొనసాగించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. తుమ్ములకు సంబంధించిన శకునాలు, అశుభ శకునాల్లో సంఖ్యే కాదు దిశ కూడా ముఖ్యం. ఉదాహరణకు, ఒక వ్యక్తి మీ ఎడమ వైపు నుండి తుమ్మినట్లయితే, ఆ తుమ్ము మీకు చాలా అశుభకరం, అతను కుడి వైపు నుండి తుమ్మినట్లయితే, అది చాలా శుభప్రదంగా రుజువు చేస్తుంది.
  5. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మీ ఉత్తరం లేదా పడమర దిశ నుండి తుమ్మినట్లయితే, అది మీకు  ధన లాభానికి కారణం అవుతుంది. ఉత్తరం, పడమర దిశల నుండి వచ్చే తుమ్ములు వృత్తి-వ్యాపారంలో పురోగతి,  లాభాలను తెస్తాయని నమ్ముతారు.
  6. హిందూ విశ్వాసం ప్రకారం సకల దేవలు నివసించే ఆవు మీ ఇంటిని విడిచిపెట్టినప్పుడు తుమ్మినట్లయితే, అది అశుభమైనదిగా పరిగణించబడదు. అయితే అది శుభప్రదంగా పరిగణించబడదు. ఆవు తుమ్మడం వల్ల అన్ని పనులు విజయవంతం అవుతాయని భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)