Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadra Rajayogam: ఏర్పడనున్న భద్ర రాజ యోగం.. ఈ 3 రాశుల ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం.. పూర్తి వివరాలు మీ కోసం..

బుధుడు 1 సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన కన్యరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా అక్టోబర్‌లో భద్ర రాజయోగం ఏర్పడనుంది. భద్ర రాజ యోగంతో కొన్ని రాశుల వారికీ శుభప్రదం కానుంది. జాతకంలో మొదటి ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు భద్రయోగం ఏర్పడడం వలన మనిషికి ఆరోగ్యం, గౌరవం, సంపదలు లభిస్తాయి. నాల్గవ ఇంట్లో ఉంటే ఇల్లు,వాహన యోగం, ఏడవ ఇంట్లో వైవాహిక ఆనందం,  10వ ఇంట్లో ఉద్యోగస్తులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ప్రమోషన్, పెరుగుదల, ఇంక్రిమెంట్ పొందవచ్చు. ఈ రోజు భద్ర రాజ యోగంతో శుభఫలితాలను పొందే రాశుల గురించి తెలుసుకుందాం.. 

Bhadra Rajayogam: ఏర్పడనున్న భద్ర రాజ యోగం.. ఈ 3 రాశుల ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం.. పూర్తి వివరాలు మీ కోసం..
Bhadra Raja Yoga 2023
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2023 | 9:35 AM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జాతక కుండలిలో పంచ మహా పురుష యోగాకు చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలో బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని గ్రహాలు తమ తమ రాశులలో బలమైన స్థానంలో ఉన్న సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ పంచ మహాపురుష యోగాలు.. బృహస్పతితో హంస యోగం, బుధునితో భద్ర యోగం, శుక్రుడుతో మాలవ్య యోగం, కుజుడు ద్వారా రుచక్ యోగం, శని ద్వారా శాస యోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో బుధుడు 1 సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన కన్యరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా అక్టోబర్‌లో భద్ర రాజయోగం ఏర్పడనుంది. భద్ర రాజ యోగంతో కొన్ని రాశుల వారికీ శుభప్రదం కానుంది.

జాతకంలో మొదటి ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు భద్రయోగం ఏర్పడడం వలన మనిషికి ఆరోగ్యం, గౌరవం, సంపదలు లభిస్తాయి. నాల్గవ ఇంట్లో ఉంటే ఇల్లు,వాహన యోగం, ఏడవ ఇంట్లో వైవాహిక ఆనందం,  10వ ఇంట్లో ఉద్యోగస్తులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ప్రమోషన్, పెరుగుదల, ఇంక్రిమెంట్ పొందవచ్చు. ఈ రోజు భద్ర రాజ యోగంతో శుభఫలితాలను పొందే రాశుల గురించి తెలుసుకుందాం..

భద్ర రాజయోగం ఏ ఏ రాశులకు అదృష్టాన్ని తెస్తుందంటే..

కన్య రాశి: బుధుడు, భద్ర రాజయోగం శుభప్రదమని నిరూపించవచ్చు. జాతకుని లగ్న గృహంలో బుధుడి  సంచరించనున్నాడు. దీంతో జీవిత భాగస్వామికి విజయావకాశాలు ఉంటాయి. వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు భాగస్వామ్య పని నుండి ప్రయోజనం పొందవచ్చు. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మకర రాశి: భద్ర రాజ్యయోగం ఏర్పడటంతో ఈ రాశివారికి  మంచి రోజులు ప్రారంభమవుతాయి. ధార్మిక పనులకు ధనాన్ని వెచ్చిస్తారు. వస్తు సౌకర్యాలలో ప్రయోజనం ఉంటుంది. పని-వ్యాపారానికి సంబంధించి కూడా ప్రయాణం చేయవచ్చు. అదృష్టం ఈ రాశికి సొంతం. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులలో విజయం పొందే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: భద్ర రాజయోగం ఏర్పడటం ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుభప్రదంగా, ఫలప్రదంగా నిరూపించబడుతుంది. ఆఫీసులో సహోద్యోగులతో మీ సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారవేత్త మంచి ఆర్డర్లు పొందవచ్చు. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
విరేచనాలు తగ్గడానికి ఇలా చేసి చూడండి..!
విరేచనాలు తగ్గడానికి ఇలా చేసి చూడండి..!