- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips:arrival of these birds in house indicates the arrival of Goddess Lakshmi devi luck will shine
Vastu Tips: ఇంట్లోకి ఈ పక్షుల రాక శుభ చిహ్నం.. సుఖ సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన..
హిందూ మతంలో మొక్కలను, జంతువులను, పక్షులను పూజిస్తారు. ప్రకృతిని భగవంతుని స్వరూపంగా కూడా భావిస్తారు. అంతేకాదు కొన్ని జంతువులు, పక్షులు నిజ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదకు సూచికలుగా నమ్ముతారు. కొన్ని రకాల పక్షులను పెంచుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతాడు.
Updated on: Aug 03, 2023 | 8:59 AM

పురాణాల మత గ్రంథాల్లో సంపదకు అధినేత లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. ఈ రోజు ఆర్ధిక ప్రయోజనాలు, సుఖ సంతోషాలను కలిగించే పక్షులకు సంబంధించిన కొన్ని సంకేతాల గురించితెలుసుకుందాం.. కొన్ని రకాల పక్షాలు ఇంటికి రాక చాలా శుభప్రదంగా భావిస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబను సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఎవరికైనా గుడ్లగూబ కనిపిస్తే అది శుభ సూచకంగా పరిగణిస్తారు. అంతేకాదు గుడ్లగూబ కనిపించడం రానున్న కాలంలో ఐశ్వర్యం, శ్రేయస్సు , ఆనందం లభిస్తాయని ఇది సూచనగా భావిస్తారు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. లక్ష్మిదేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం.

ఇంట్లోకి రామ చిలుక రావడం శుభసూచకంగా భావిస్తారు. రామ చిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సు కు చిహ్నంగా చూస్తారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుక సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం కాకుల రాక ఇంటికి శుభప్రదం. అతిథుల రాక గురించి హెచ్చరించడానికి కాకులు ఇంటికి వస్తాయని నమ్ముతారు. అలాగే, భవిష్యత్తులో మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు ను అవి కోరుకుంటాయని విశ్వాసం.

గరుడపక్షికి హిందూ సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉంది. వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షి. హిందూ మతంలో ఈ పక్షిని విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు. అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా పరిగణిస్తారు. నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు. అంతేకాదు ఇది ఆనందం, శ్రేయస్సు , అదృష్టానికి శుభసూచకంగా పరిగణిస్తారు.

ఇంటికి తెల్ల పావురం రావడం శుభ సంకేతం. తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని విశ్వాసం. ఇంటి పైకప్పు మీద కూర్చుని తెల్లని పావురం కూయడం ఇంటికి శ్రేయస్కరమని భావిస్తారు.





























