Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday Vratam: శనీశ్వరుడి అనుగ్రహం కోసం 7 శనివారాల వ్రతం.. నియమాలు, పూజా విధానం మీ కోసం..

శనివారపు వ్రతాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు. అయితే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు శుక్ల పక్షంలోని ఏదైనా శనివారం నుండి ఈ ఉపవాసం ప్రారంభించవచ్చు. శనివారం వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం నుండి ఉద్యోగం వరకు లభిస్తాయని నమ్మకం. ఈ ఉపవాసం క్రమశిక్షణను నేర్పుతుంది. కష్టపడి పనిచేసే శక్తిని పెంచుతుంది.

Saturday Vratam: శనీశ్వరుడి అనుగ్రహం కోసం 7 శనివారాల వ్రతం.. నియమాలు, పూజా విధానం మీ కోసం..
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2023 | 1:12 PM

హిందూమతంలో శనివారం ఉపవాసం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కర్మ ప్రదాత, న్యాయ దేవుడు అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ఉపవాసం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి.. హృదయపూర్వకంగా శనీశ్వరుడిని ధ్యానిస్తే ఏలి నాటి శని నుంచి విము క్తి లభించి శని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

వాస్తవానికి శనీశ్వరుడు దృష్టి తమ పై పడితే చెడు చేస్తాడని భావిస్తారు.. అంతేకాదు భయపడతారు కూడా.. అయితే శనీశ్వరుడి దృష్టి అనుగ్రహం కలిగితే అతని జీవితం రాజుగా సాగుతుందని నమ్మకం. శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే అన్ని కష్టాల నుంచి విముక్తి లభించి సుఖ సంతోషాలు దొరుకుతాయని విశ్వాసం.

ఉపవాసం ఎలా చేయాలంటే.. ?

శనివారపు వ్రతాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు. అయితే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు శుక్ల పక్షంలోని ఏదైనా శనివారం నుండి ఈ ఉపవాసం ప్రారంభించవచ్చు. శనివారం వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం నుండి ఉద్యోగం వరకు లభిస్తాయని నమ్మకం. ఈ ఉపవాసం క్రమశిక్షణను నేర్పుతుంది. కష్టపడి పనిచేసే శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఎన్ని శనివారాలు ఉపవాసం దీక్ష చేయాలంటే? 

హిందూ విశ్వాసాల ప్రకారం 7 శనివారాలు ఉపవాసం ఉండటం వల్ల శని కోపం నుండి రక్షణ లభిస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. శనివారం ఉపవాసం ఉండాలంటే సరైన పూజ విధానం ఏమిటో తెలుసుకుందాం

శనివారం ఉపవాసం చేయాల్సిన విధానం

  1. శనివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఉపవాస వ్రతం దీక్ష మొదలు పెట్టాలి.
  2. దీని తరువాత శని విగ్రహం లేదా శని యంత్రాన్ని ఉంచి శని మంత్రాలను జపించండి.
  3. ఈ సమయంలో  శనీశ్వరుడికి పంచామృతంతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
  4. ఆ తర్వాత నల్ల బట్టలు, నల్ల నువ్వులు, ఆవనూనె సమర్పించి ఆవనూనె దీపం వెలిగించాలి.
  5. దీని తరువాత  శనీశ్వరుడి చాలీసా, కథ కూడా పఠించండి.
  6. పూజ సమయంలో శనీశ్వరుడికి పూరీ, మినుమలతో చేసిన పదార్ధాలను నైవేద్యంగా సమర్పించండి. చివరన పూజ సమయంలో తెలిసి.. తెలియక చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి.. దణ్ణం పెట్టుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)