Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు.. మీ రాశికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope (06-12 August): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? 06వ తేదీ ఆగస్టు నుంచి 12వ తేదీ ఆగస్టు వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు.. మీ రాశికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope 06 12 August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Aug 06, 2023 | 6:46 AM

Weekly Horoscope (06-12 August): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? 06వ తేదీ ఆగస్టు నుంచి 12వ తేదీ ఆగస్టు వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాలకు సంబంధించి వినూత్న ఆలోచనలు చేసి అమలు చేస్తారు. దాదాపు ప్రతి ఆలోచనా, ప్రతి ప్రయత్నమూ ఆశించిన ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా బాగుంటుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కార్యసిద్ధి లభిస్తుంది. అశ్విని, భరణి నక్షత్రాల వారికి బాగా కలిసి వస్తుంది. వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇష్టదైవానికి మరింత శ్రద్ధగా ప్రార్థనలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసుకోవడం మంచిది కాదు. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా తరచూ సమస్యలు తలెత్తడం తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ వారం తప్పకుండా చాలావరకు పరిష్కారం అవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. యాక్టివిటి బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా, ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. రోహిణి నక్షత్రం వారికి ఇతర నక్షత్రాల వారి కంటే మరింతగా బాగుంటుంది. తరచూ ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయడం వల్ల మనసులోని చిన్నాచితకా ఆందోళనలు దూరమవుతాయి. వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాబడికి, లాభాలకు లోటుండకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మొత్తం మీద జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మీరనుకున్నట్టే ముందుకు వెడతాయి. ఉద్యోగంలో సహచరులతో కలిసి ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసి, అధికారుల ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులకు కలుసుకుని కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చ వద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. తల్లితండ్రుల బాగోగుల పట్ల శ్రద్ధ తీసుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్ద్రా, పునర్వసు నక్షత్రంవారు ఆశించిన శుభవార్తలు వింటారు. సుందరకాండ పారాయణం వల్ల శుభఫలితాలు అనుభవానికి వస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయినప్పటికీ, సమయస్ఫూర్తితో వాటిని అధిగ మిస్తారు. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దూర ప్రాంతాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభించకపోవచ్చు. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి సారిస్తారు. అష్టమ శని కారణంగా ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవ కాశం ఉంది. కీలక వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అప్రమ త్తంగా ఉండడం మంచిది. పుష్యమి నక్షత్రం వారికి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో ఉన్న గురువు కారణంగానూ, సింహ రాశిలో ఉన్న మూడు శుభగ్రహాల కారణంగానూ ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. అవసరాలకు మించి చేతికి డబ్బు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మంచి వ్యక్తులు జీవితంలోకి ప్రవేశిస్తారు. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే వారమంతా ప్రశాంతంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగానికి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి లేనిపోని మానసిక ఆందోళనలు పెట్టుకోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. మఖా నక్షత్రం వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యా ష్టకం చదువుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ప్రస్తుతానికి రవి, శని, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల, ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల మీద కాస్తంత శ్రద్ధను పెంచడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. గట్టి ప్రయత్నంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం వంటివి జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యానికి ఆహ్వానం అందుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవికి ప్రార్థన చేయడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సప్తమ రాశిలో గురువు, లాభ స్థానంలో మూడు శుభ గ్రహాలు ఉన్న కారణంగా దాదాపు ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త ఆలోచనలు చేయడం జరుగుతుంది. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. రాశి అధిపతి అయిన శుక్రుడు వక్రించినందువల్ల కొద్ది రోజుల పాటు డబ్బులివ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. స్వాతి నక్షత్రంవారికి శుభవార్తలు అందుతాయి. ఆదిత్య హృదయం చదువు కోవడం వల్ల వ్యవహార జయం ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ స్థానంలో శుభ గ్రహాలు కేంద్రీకృతమైనందువల్ల కెరీర్ పరంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం, సమస్యలను అధిగమించడం, ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. ఆర్థిక విష యాలకు, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనేక వ్యవహారాలను ఒకేసారి నిర్వహించడం, పూర్తి చేయాలనుకోవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే సూచనలున్నాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు చోటు చేసు కునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. జ్యేష్ట నక్షత్రం వారు శుభవార్త వింటారు. శివార్చన చేయించడం వల్ల శని దోషం తగ్గుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి అయిన గురువుతో సహా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. అతి ముఖ్యమైన ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. కొందరు ప్రముఖ వ్యక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు అంది రావడం కూడా జరుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని కీలకమైన పనులు సానుకూలపడతాయి. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరించి సహచరులతో సమస్యల నుంచి బయటపడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు దగ్గర బంధువుల కారణంగా చిక్కుల్లో పడవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్టం కలిసి వస్తుంది. శివార్చన చేయించడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): కుటుంబ వ్యవహారాల మీద దృష్టి సారించడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్య మైన సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి బంధువుల జోక్యంతో పరిష్కారం అవుతుంది. గృహ, వాహన సంబంధమైన విషయాల్లో ఆటంకాలు తొలగుతాయి. వీలై నంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే భంగపాటు ఎదురవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్తరాషాఢ వారికి ఒక ముఖ్యమైన శుభవార్త అందుతుంది. శివార్చన చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యల్లో ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. గృహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతి కూడా తక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని బాధపడడం మంచిది కాదు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రంవారికి అవకాశాలు పెరుగుతాయి. లలితా సహస్ర నామం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గురు, బుధ గ్రహాల అనుకూలత వల్ల ఊహించని విధంగా కొన్ని మంచి పరిణామాలు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను అమలు చేసి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా ‍సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొందరు సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సానుకూలంగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండక పోవచ్చు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి సమస్య అను కూలంగా పరిష్కారం అవుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. రేవతి నక్షత్రంవారికి ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. సుందరకాండ పారాయణం చేయడం మంచిది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి