AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: సింహరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశులవారి జీవితాల్లో బంగారు వర్షం..

Lakshminarayana Rajayog 2023: బుధ, శుక్ర కలయిక కారణంగా సింహరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం రాశిచక్రంలోని కొన్ని రాశులపై శుభాఫలితాలు కలిగేలా చేస్తుంది. ఫలితంగా ఆయా రాశులవారికి చెందినవారు యోగం కారణంగా వృద్ధిలోకి వస్తారు. ఇంకా ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకుంటారు. వీరి జీవితాల్లో

Astrology: సింహరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశులవారి జీవితాల్లో బంగారు వర్షం..
Lakshminarayana Rajayog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 05, 2023 | 8:14 PM

Share

Lakshminarayana Rajayog 2023: గ్రహాల రాకుమారుడిగా ప్రసిద్ధి చెందిన బుధుడు జూలై 25న సింహరాశిలో ప్రవేశించి అప్పటికే ఆ రాశిలో ఉన్న శుక్రుడితో కలిశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ప్రత్యేకమైన యోగాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే బుధ, శుక్ర కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం రాశిచక్రంలోని కొన్ని రాశులపై శుభాఫలితాలు కలిగేలా చేస్తుంది. ఫలితంగా ఆయా రాశులవారికి చెందినవారు యోగం కారణంగా వృద్ధిలోకి వస్తారు. ఇంకా ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకుంటారు. వీరి జీవితాల్లో ధనవర్షం కురుస్తుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులేమిటంటే..

సింహ రాశి: సింహరాశిలోనే లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడినందున ఈ రాశివారికి శుభఫలితాలు కలుగుతాయి. ఫలితంగా మీరు ఈ సమయంలో లాభాలను పొందుతారు. ఇంకా వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం విషయంలో మీరు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు ఈ సమయంలో అప్పుల బాధ తొలగిపోతుంది.

తుల రాశి: లక్ష్మీనారాయణ రాజయోగం తులారాశి వారికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు జాబ్ ప్రయోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు. చేసిన పనికి ఫలితం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సంతోషంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: సింహరాశిలో బుధ, శుక్ర సంచారం కుంభరాశివారికి కలిసి వస్తుంది. నలుగురిలో మీ కీర్తి పెరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. అర్థిక సమస్యలను అధిగమించి ఆదాయం పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో అనూహ్య లాభాలు వస్తాయి.

మేష రాశి: లక్ష్మీనారాయణ రాజయోగం మేషరాశి వారికి మేలు చేసేదిగా ఉంటుంది. బుధశుక్ర సంచారం కారణంగా మేషరాశివారి మేధస్సు పెరుగుతుంది. కెరీర్‌లో ఉన్నతస్థాయి, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలతో అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. చుట్టూ ఉన్నవారంతా మీ గురించి మంచిగా చెప్పుకుంటారు.

Note: ఇక్కడ తెలిపిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుందని గమనించగలరు. సమాచారాన్ని నిర్ధారించేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్