- Telugu News Photo Gallery Follow these effective and working home remedies to get rid of hair problems in the monsoon season
Hair Care: జట్టు సమస్యలు వేధిస్తున్నాయా..? ఈ హోమ్ రెమెడీస్‌ని పాటిస్తే ఒత్తైన కేశాలు మీ సొంతం..
Healthy Hair: వర్షాకాలం రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఎదురవడం సహజం. ఇక ఈ జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు అందరూ షాంపూలను ఆశ్రయిస్తారు. కానీ ఫలితాలు ఉండవు. అందుకు షాంపూల నాణ్యత, వాటిలోని రసాయనాల వినియోగమే కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి షాంపూలు లేకుండానే జుట్టు సమస్యలను వదిలించుకోవచ్చు. అదెలా అంటే..?
Updated on: Aug 05, 2023 | 1:38 PM

Healthy Hair: వర్షంలో తడిసిన జుట్టును కేశ సమస్యలు వేధించడం సహజం.. అయితే ఆ సమస్యలకు ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చు.


ఈ క్రమంలో మీరు జుట్టు సమస్యల నివారణ కోసం నిమ్మకాయను వాడండి. నిమ్మకాయలో ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని తీసుకుని తలకు పట్టించి ఓ 15 నిముషాలు అలాగే ఉంచండి. తర్వాత తల స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు.

ఆముదం: ఆముదంలో అద్భుత గుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే చిన్నప్పుడు ప్రతి ఒక్కరి తలకు ఆముదం నూనె రాసేవారు. ఇక జుట్టు సమస్యల నివారణ కోసం మీరు కొబ్బరి, ఆముదం నూనెలను కలిపి తలకు పట్టించండి. రాత్రి వేళలో ఇలా చేసి ఉదయాన్నే తల స్నానం చేయండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

మెంతులు: కేశ సమస్యలకు మెంతులు నిజంగా అద్భుతమైన పరిష్కారం. జుట్టు పోషణకు ఉపయోగపడే పోషకాలు ఇందులో ఉండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో మీరు మెంతులను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించండి. 30 నిముషాలు అలాగే ఉంచి, తర్వాత తల స్నానం చేయండి.





























