- Telugu News Photo Gallery Spiritual photos Venus transit in Cancer: Know its effects on all zodiac signs Astro Tips in Telugu
Venus Transit 2023: కర్కాటక రాశిలోకి శుక్రుడు సంచారం.. ప్రేమ పక్షులకు అగ్నిపరీక్షలు తథ్యం..! మీ రాశికి ఎలా..?
Shukra Gochar 2023: సింహ రాశిలో వక్రించిన శుక్రుడు ఈ నెల 8 నుంచి వెనక్కు వెళ్లి, మళ్లీ కర్కాటక రాశిలో కూడా ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ 1వ తేదీ వరకూ కర్కాటక రాశిలో కొనసాగుతాడు. అక్టోబర్ 1వ తేదీ వరకూ ప్రేమికులు, ప్రేమ పక్షలు అప్రమత్తంగా ఉండడం, అపార్థాలకు దూరంగా ఉండడం మంచిది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Aug 04, 2023 | 6:59 PM

జ్యోతిష శాస్త్రంలో ప్రేమలకు, శృంగారానికి, ప్రేమ పెళ్లిళ్లకు కారకుడైన శుక్ర గ్రహం వక్రగతి పట్టింది. సింహ రాశిలో వక్రించిన శుక్రుడు ఈ నెల 8 నుంచి వెనక్కు వెళ్లి, మళ్లీ కర్కాటక రాశిలో కూడా ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ 1వ తేదీ వరకూ కర్కాటక రాశిలో కొనసాగుతాడు. శుక్రుడు ఈ విధంగా వక్రించడం, తిరోగమనం చెంది కర్కాటకంలో ప్రవేశించడం వగైరాల వల్ల ప్రేమ జీవితాల్లో తప్పకుండా అలజడి లేదా కల్లోలం సృష్టించడం జరుగుతుంది. ప్రేమలకు సంబంధించిన గ్రహం వక్రిస్తే ప్రేమ జీవితం కూడా వక్రిస్తుందనే అర్థం. అక్టోబర్ 1వ తేదీ వరకూ ప్రేమికులు, ప్రేమ పక్షలు అప్రమత్తంగా ఉండడం, అపార్థాలకు దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండని పక్షంలో భగ్న హృదయులు కావడం తథ్యం. వివిధ రాశులవారికి శుక్రుడి వక్రం ఏ విధంగా ఉండబోతోందో ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం: ప్రస్తుతం సింహరాశిలో వక్రించి ఉన్న శుక్ర గ్రహం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది మేషరాశి వారే. హఠాత్తుగా ప్రేమ భాగస్వామి పట్లో, ప్రేమ జీవితం పట్లో విరక్తి కలిగే అవకాశం ఉంది. తీవ్రస్థాయి అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించ డానికే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొత్తగా ప్రవేశించేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: ఈ రాశి అధిపతి కూడా అయిన శుక్రుడు వక్రించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశివారు తప్ప టడుగు వేసే అవకాశం ఉంది. తొందరపాటు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మామూలు సమస్యలను భూతద్దంలో చూడడం సమంజసం కాదు. చెప్పుడు మాటల్ని పట్టించు కోవద్దు. ప్రేమికుల మధ్య విభేదాలు, వివాదాలను సృష్టించడానికి కొందరు చేసే ప్రయత్నాలను అర్థం చేసుకోవడం మంచిది. ప్రేమికుడు లేదా ప్రేయసిలో ఎటువంటి లోపమూ లేదని అర్థం చేసుకోవాలి.

మిథునం: ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. మధ్య మధ్య కొద్దిపాటి చిట పటలు ఉన్నా అవి వెనువెంటనే మాయమైపోతుంటాయి. మాట తొందరపాటును తగ్గించుకోవడం మంచిది. ప్రేమ యాత్రల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామికి విలువైన కానుకలు అర్పించే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేయసీ ప్రియుల మధ్య అన్యోన్యత పెరగడం, అరమరికలు తొలగిపోవడం వంటివి జరుగుతాయి. దూకుడుతనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం: ప్రేమ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించడానికి, ఏదో కారణంగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా కాస్తంత ఎడబాటు చోటు చేసుకోవడం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు తెగిపోయే అవకాశం మాత్రం లేదు. కొత్తగా ప్రేమల్లో ప్రవేశిస్తున్నవారు కొద్దిగా ఆలో చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొందరి ప్రేమలు మఖలో పుట్టి పుబ్బలో మూతపడి నట్టుగా మాయమైపోవచ్చు. మొత్తానికి ప్రేమ జీవితానికి కొద్దిపాటి అగ్నిపరీక్ష తప్పకపోవచ్చు.

సింహం: ప్రేమ వ్యవహారాలకు పెరిగి పెద్దవి కావడానికి ఏవి అవసరమో ఆలోచించుకుని నిర్ణయాలు తీసు కోవడం మంచిది. అహంకారాలను, దూకుడుతనాలను కొద్దిగా దూరం పెట్టవలసిన అవసరం ఉంది. బాధ్యతగా, ఆప్యాయంగా వ్యవహరించడం ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ రెండు నెలల కాలంలో ప్రేమ వ్యవహారాలు గతుకుల రోడ్డు మీద నడవడం ఖాయం. ఒడిదుడు కులు తప్పకపోవచ్చు. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తేనే ప్రేమ పరీక్షలకు నిలబడగలుగుతారు.

కన్య: ఈ రాశివారికి మాత్రం ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమల్లో కూడా ప్రయోగాలు చేయడం, కొత్త కొత్త మార్గాలను అనుసరించడం జరుగుతుంది. కాస్తంత భారీగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, చిత్రవిచిత్రమైన ప్రదేశాలకు వెళ్లడం, కొత్త మార్గాలను అన్వేషించడం, కొత్త రుచులను ఆస్వాదించడం వంటివి చోటు చేసుకుంటాయి. ప్రేమ భాగస్వామికి వినూత్నమైన కానుకలతో ముంచెత్తడం కూడా జరుగుతుంది. కొత్తవారికి ప్రేమ అవకాశాలు ఏర్పడతాయి.

తుల: ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాల్లో అసలు సిసలు అగ్నిపరీక్షలు ఎదురవుతాయి. తానొకటి తల చిన దైవమొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. ప్రేమ జీవితానికి అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. అలకలు, అపార్థాలు ఒక పాలు ఎక్కువగానే ఉండి, ఓర్పు, సహనా లకు పరీక్షకు పెడతాయి. ఎక్కడా ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. సాధార ణంగా ప్రేమ వ్యవహారాల్లో ఏదీ మీరనుకున్నట్టు జరగదు. అక్టోబర్ నుంచి పరిస్థితి చక్కబడుతుంది.

వృశ్చికం: ఒక దశలో ప్రేమ వ్యవహారం నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది. ఏదో ఒక కారణం మీద కలహాలు, కలతలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రేమ భాగస్వామి నుంచి ఆశించిన సహకారం, అవగాహన లభించకపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రెండు నెలల పాటు ఇబ్బంది పెడతాయి. తెగతెంపులు చేసుకునే అవకాశం ఉండదు. కలహాల కాపురం తప్పకపోవచ్చు. కొత్త వారు కొద్ది కాలం పాటు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం మంచిది.

ధనుస్సు: ప్రేమ వ్యవహారాల్లో అవతలి వ్యక్తి గురించి తప్పుడు అంచనాలకు వచ్చే అవకాశం ఉంది. తప్పట డుగు వేశామా అన్న ఆలోచన వస్తుంది. స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నిజాయతీ లోపించడం వంటివి అనుభవానికి వస్తాయి. నిజ స్వరూపం బయటపడుతుంది. మొత్తం మీద ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగేలా కనిపించడం లేదు. ఓ రెండు నెలల పాటు హద్దుల్లో ఉంటే ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు వ్యవహారాలు పనికి రావు.

మకరం: ఈ రాశివారికి వక్ర శుక్రుడి వల్ల ప్రేమ జీవితంలో తప్పకుండా పరీక్షలు ఎదురవుతాయి. ఇద్దరి మధ్యా ప్రేమ ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అపార్థాలు, తప్పుడు ఆలోచనలతో ఎడబాటు ఏర్పడే ప్రమాదం ఉంది. నిజానికి ఇద్దరి మధ్యా నిఖార్సయిన ప్రేమ వ్యవహారమే ఉన్న ప్పటికీ, ఇతరుల జోక్యం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాలను అక్టోబర్ వరకూ రహస్యంగా ఉంచడమే మంచిది. ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

కుంభం: ప్రేమ భాగస్వామిలో లోపాలు కనిపిస్తాయి. నిజాయతీ లోపించిందన్న అనుమానాలు కలుగుతాయి. మొత్తానికి భగ్న ప్రేమికులయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ రాశివారు ప్రేమ వ్యవహా రాల్లో రెండు నెలల పాటు ఆచితూచి వ్యవహరించడమే మంచిది. ప్రేమ వ్యవహారాల వల్ల మన శ్శాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవతలి వ్యక్తి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. అనుకున్నదొకటి అయింది ఒక్కటి అన్నట్టుగా ఉంటుంది.

మీనం: ప్రేమ వ్యవహారాలు మునుపటి కన్నా పటిష్ఠం అవుతాయి. అరమరికలు తొలగిపోతాయి. సాన్ని హిత్యం పెరుగుతుంది. అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ప్రేమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు బాగా కలిసే అవకాశం ఉంది. ప్రేమ యాత్రలు, విహార యాత్రలు చోటు చేసుకుంటాయి. విలువైన కానుకలు కొనిపెట్టడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు ఈ రెండు నెలల పాటు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.





























