- Telugu News Photo Gallery Spiritual photos Mantralaya Sri Guru Raghavendra Temple Hundi Collection Rs.3 Crore 79 Lakhs in Last 34 Days
Mantralayam Hundi: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. రికార్డు స్థాయిలో హుండి ఆదాయం..
కలియుగ కామధేనువు భక్తుల కల్పవృక్ష మంత్రాలయం శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చాయి. రాయచూరుకు చేరువలో ఉన్న మంత్రాలయ రాయల మఠానికి విరాళాల రూపంలో కోట్ల రూపాయల డబ్బు వెల్లువెత్తింది. గత నెల అంటే జులైతో కలిపి మొత్తం 34 రోజుల్లో మంత్రాలయం మఠానికి మళ్లీ భారీస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి.
Updated on: Aug 04, 2023 | 2:29 PM

శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇటు ఏపీ, తెలంగాణ అటు కర్ణాటకకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. తమిళనాడు నుంచి కూడా గణనీయంగా దర్శించుకుంటారు. మంత్రాలయం మఠానికి మళ్లీ భారీస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి.

మంత్రాలయంలో గత 34 రోజులుగా హుండీ లెక్కింపు పూర్తయింది. ఇదిలా ఉండగా మంత్రాలయం మఠం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా గణనీయమైన ఆదాయం హుండీ ద్వారా సమకూరింది.

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గత 34 రోజుల్లో రూ. 3 కోట్ల 79 లక్షల 62 వేల 469 విరాళాల రూపేణా వచ్చాయి.

వీటితో పాటు అదనంగా 99 గ్రాముల బంగారం, కిలో 940 గ్రాముల వెండి వస్తువులు కూడా భక్తులు సమర్పించుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

హుండీ లెక్కింపులో వందలాది మంది మఠం సిబ్బంది పాల్గొన్నారు

మంత్రాలయ రాయల మఠంలోని హుండీలకు ప్రస్తుత నెలలో భక్తుల నుండి రికార్డు స్థాయిలో కానుకలు అందాయి. ఇది ఇప్పటివరకు వచ్చిన పెద్ద మొత్తం అని మఠం నిర్వాహాకులు తెలిపారు.





























