Vastu Tips for Home: ఇంట్లో వాస్తు దోషాలను ఎలా తెలుసుకోవాలి.. నివారణ చర్యలు ..చెత్త బుట్టను ఏ దిశలో పెట్టాలంటే..
విశ్వాసాల ప్రకారం అగ్ని, నీరు, భూమి, గాలి, అంతరిక్షం వంటి పంచభూతాలలో ఏదైనా ఒక దాని సమతుల్యత చెడిపోయినట్లయితే.. ఇంట్లో వాస్తు దోషాలు సంభవించవచ్చు. దీన్ని పోగొట్టుకోవడానికి వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రంలో ఇంటి ఈశాన్య దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే పాత వస్తువులు, చెత్త వంటి వాటిని ఎప్పుడూ ఈ దిక్కున ఉంచకూడదు. అలాగే స్టోర్ రూమ్ కూడా ఈ దిక్కున నిర్మించకూడదు.
వాస్తు శాస్త్రం హిందూ వ్యవస్థలోని పురాతన శాస్త్రాలలో ఒకటి. వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే ప్రతికూల శక్తి ఇంట్లో తిరుగుతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాదు సంతోషం, శాంతి అన్న మాటే దూరమవుతాయి. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి కొన్ని సాధారణ వాస్తు నివారణలు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు.
వాస్తు దోషాన్ని ఎలా కనుగొనాలంటే..
విశ్వాసాల ప్రకారం అగ్ని, నీరు, భూమి, గాలి, అంతరిక్షం వంటి పంచభూతాలలో ఏదైనా ఒక దాని సమతుల్యత చెడిపోయినట్లయితే.. ఇంట్లో వాస్తు దోషాలు సంభవించవచ్చు. దీన్ని పోగొట్టుకోవడానికి వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
ఈ దిశలో చెత్తను ఉంచవద్దు
వాస్తు శాస్త్రంలో ఇంటి ఈశాన్య దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే పాత వస్తువులు, చెత్త వంటి వాటిని ఎప్పుడూ ఈ దిక్కున ఉంచకూడదు. అలాగే స్టోర్ రూమ్ కూడా ఈ దిక్కున నిర్మించకూడదు.
ఆగ్నేయ దిశలో ఏ ఫోటోని ఏర్పాటు చేసుకోవాలంటే
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఆగ్నేయ దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి అగ్ని మూలకాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.
ఉత్తర దిశలో ఉంచాల్సిన వస్తువులు
ఇంటి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను ఉంచడం మంచిది. దీనితో పాటు, మీరు ఇంటికి ఉత్తర దిశలో నీలం రంగు గాజు సీసాలో మనీ ప్లాంట్‌ను నాటవచ్చు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును ఉంచుతుంది. అంతేకాదు ఇంట్లోని ప్రతికూలత తొలగిపోతుంది
ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటండి. అలాగే తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి. తెల్లవారుజామున సూర్యకిరణాలు ఇంటిపై పడినప్పుడు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా నమ్ముతారు. అలాగే ఉదయం పూట ఇంటి కిటికీలు, తలుపులు కొంతసేపు తెరిచి ఉంచితే స్వచ్ఛమైన గాలితోపాటు పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)