Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: నేడు రవి, శూల యోగాలు.. శివయ్యను పూజించడం శుభప్రదం.. సిరిసంపదలు మీ సొంతం..

ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ.. కష్టాలను ఎదుర్కోనే శక్తి లేకుంటే.. వారు సోమవారం నాడు శివుడిని పూజించాలి. సనాతన సంప్రదాయం ప్రకారం సోమవారం నాడు శివలింగాన్ని భక్తి , విశ్వాసంతో పూజిస్తే. మహాదేవుడు ఆ భక్తుని కోరికలన్నింటినీ  తీర్చి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అంతేకాదు సుఖ సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం. 

Monday Puja Tips: నేడు రవి, శూల యోగాలు.. శివయ్యను పూజించడం శుభప్రదం.. సిరిసంపదలు మీ సొంతం..
Lord Shiva
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2023 | 10:06 AM

హిందూ మతంలో లయకారుడైన మహాదేవుడి పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి శ్రద్దలతో శంభోశంకర అంటూ జలంతో పూజించినా చాలు.. కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. పూజలతో సంతోషించే దేవదేవుడు. శివయ్యను ప్రతి రోజూ ఆరాధించవచ్చు.. అయితే శివయ్యకు అంకితం చేయబడిన సోమవారం అత్యంత ఫలవంతం అయితే.. శ్రావణ కార్తీక మాసాల్లోని సోమవారం మరింత విశిష్టమని హిందువుల నమ్మకం  శ్రావణ మాసంలోని సోమవారం ఆయనను పూజిస్తే ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. ఈరోజు శ్రావణ  సోమవారం. ఈ రోజు ఉపవాసం ఉండటం, మహాదేవుని పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. సోమవారాలలో శివుడిని పూజిస్తే, మహాదేవుడు సంతోషిస్తాడు. తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. అంతేకాదు శివుని అనుగ్రహంతో, భక్తుల అన్ని పనులు కూడా పూర్తవుతాయి.

ఏ పద్ధతితో పూజ చేస్తే శివుడు సర్వ దుఃఖాలను దూరం చేస్తాడంటే..

ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ.. కష్టాలను ఎదుర్కోనే శక్తి లేకుంటే.. వారు సోమవారం నాడు శివుడిని పూజించాలి. సనాతన సంప్రదాయం ప్రకారం సోమవారం నాడు శివలింగాన్ని భక్తి , విశ్వాసంతో పూజిస్తే. మహాదేవుడు ఆ భక్తుని కోరికలన్నింటినీ  తీర్చి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అంతేకాదు సుఖ సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం.

సోమవారం శుభ యోగం

ఈ రోజు శుభ యోగం ఏర్పడుతోంది. ఈ రోజున రవియోగం, శూలయోగం ఏర్పడుతున్నాయి. రవియోగంలో శుభ కార్యాలు, పూజలు మొదలైనవి చేయడం వల్ల గౌరవం పెరిగి సంపద కూడా పెరుగుతుంది. రవి యోగం ఉదయం 05:46 నుండి మరుసటి రోజు (అంటే మంగళవారం) తెల్లవారుజామున ..  01:16 వరకు ఉంటుంది. అయితే శూల యోగా ఆగస్టు 06, 2023న రాత్రి 08:27 నుండి ఆగస్టు 07, సాయంత్రం 06:17 వరకు ఉంటుంది. రవి , శూల యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..