Horoscope Today: కర్కాటక రాశివారు ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.. 12 రాశులవారి మంగళవారంనాటి రాశిఫలాలు
Daily Horoscope (August 08): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 08, 2023న(మంగళవారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
Daily Horoscope(August 08): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 08, 2023న(మంగళవారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు మాటల వల్ల బంధువులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. అధికారులు మీపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. కొందరు మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగ స్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆస్తిపాస్తుల లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఎటువంటి వ్యాపారమైనా లాభాల బాటలో సాగుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో చాలావరకు అనుకూలత ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలో సాధారణంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ, డబ్బు నష్టపోవడం గానీ, మోస పోవడం గానీ జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల కన్నా సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు కొత్త లక్ష్యాలు లేదా కొత్త బాధ్యతలను అప్ప జెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో కొద్దిగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్నడబ్బు కూడా చేతికి అందుతుంది. అయితే, అనవసర ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. వ్యాపారం సామాన్యంగా కొనసాగు తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్ర మంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడం, గౌరవాభిమానాలు పెరగడం జరుగు తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపో తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయ మార్గాలను పెంచుకోవడం మీద దృష్టి సారిస్తారు. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఇతరులకు వాగ్దా నాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఉద్యో గంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం, ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. అయితే, ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువుల్లో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): స్వయం కృషితో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరో గ్యానికి ఢోకా ఉండదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రేమలు సాఫీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): స్వల్ప అనారోగ్యం కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు, కీలక ప్రయత్నాలు ముందుకు సాగక పోవచ్చు. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. శుభ కార్యం లేదా దైవ కార్యం మీద బాగా ఖర్చవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి