కర్కాటక రాశిలోకి శుక్రుడి సంచారం.. వారికి స్త్రీ వ్యామోహం విపరీతంగా పెరగొచ్చు.. జాగ్రత్త..!
Shukra Gochar 2023: స్త్రీ గ్రహమైన శుక్రుడు స్త్రీ రాశి అయిన కర్కాటక రాశిలో వక్రగతిలో ప్రవేశించినప్పుడు స్త్రీ వ్యామోహం విపరీతంగా పెరుగుతుంది. సాధారణ కాముకులు సైతం అతి కాముకులవుతారు. నపుంసకులలో కూడా కోరికలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు. ఈ విషయంలో జాగ్రత్తగా లేకుంటే ఆ రాశుల వారు ప్రమాదంలో పడే అవకాశముంటుంది.
Venus Transit 2023: సింహ రాశిలో వక్రించిన శుక్ర గ్రహం ఈ నెల 8వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శృంగారానికి కారకుడైన శుక్ర గ్రహం జాతక చక్రంలో సరైన స్థానంలో ఉన్న పక్షంలో ‘లైంగిక వాంఛలు’ కాస్తంత ఎక్కువగా ఉంటాయి. మామూలు శుక్రుడే లైంగిక వాంఛలను అధికంగా ఇస్తున్నప్పుడు ఇక ఆ గ్రహం వక్రిస్తే చెప్పేదేముంది? శుక్రుడు వక్రించినప్పుడు మరింత బలవంతుడవుతాడు. ఫలితంగా ప్రతివారిలోనూ కోరికలు గుర్రాలవుతాయి. కొత్త కొత్త కోరికలు పుట్టుకొ స్తాయి. పైగా స్త్రీ గ్రహమైన శుక్రుడు స్త్రీ రాశి అయిన కర్కాటక రాశిలో వక్రగతిలో ప్రవేశించినప్పుడు స్త్రీ వ్యామోహం విపరీతంగా పెరుగుతుంది. సాధారణ కాముకులు సైతం అతి కాముకులవుతారు. నపుంసకులలో కూడా కోరికలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు. శుక్రుడు సింహరాశిలో వక్రించడం వల్ల కోరికలు ఎక్కువైనప్పటికీ అదుపులో ఉంటాయి. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత మాత్రం అడ్డూ ఆపూ లేకుండా విజృంభించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాల మీద కూడా చాలావరకు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు. వక్రించి కర్కాటక రాశిలో ప్రవేశించిన శుక్రుడు అక్టోబర్ 1వ తేదీ వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. శుక్రుడు వక్రించి కర్కాటక రాశిలో ప్రవేశించడం అనేది వివిధ రాశుల వారికి ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశివారికి శారీరక సుఖాలకు సంబంధించిన నాలుగవ రాశిలోకి శుక్రుడు వక్రగతిలో ప్రవే శించడం వల్ల ఎక్కువ కాలం శారీరక సుఖాల మీదే గడిపే అవకాశం ఉంటుంది. ఇందుకు రమ ణీయ ప్రదేశాలతో పాటు ప్రయాణాలు, పర్యటనలను కూడా ఎంచుకునే సూచనలున్నాయి. ఎంతకూ తృప్తి చెందని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్న శుక్ర నక్షత్రం భరణి వారికి కోరి కలు గుర్రాలయ్యే అవకాశం ఉంది. రుచులు, అభిరుచులు కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు వక్రించడం వల్ల కోరికలు పెరిగిపోయి, పక్కదోవలు తొక్కే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిదాన్నీఇదే కోణం నుంచి చూడడం జరుగుతుంది. అకస్మాత్తుగా లైంగిక వాంఛల్లో మార్పులు చోటు చేసుకోవడం,సరికొత్త ప్రయత్నాలు చేయడం, అక్రమ సంబం ధాల గురించి ఆలోచించడం వంటివి జరుగుతాయి. శారీరక సుఖాల మీదే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. ఒక విధంగా ఇది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
- మిథునం: ఈ రాశికి ద్వితీయ రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడు ఎక్కువ సంఖ్యలో స్త్రీలతో పరిచయాలు కలిగించే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో కొత్త మార్పులు తీసుకు రావడంతో పాటు, ఎక్కువగా విహార యాత్రలకు ప్లాన్ చేసే సూచనలు కూడా ఉన్నాయి. సుఖాలపై విపరీతంగా మోజు పెరిగి అక్రమ సంబంధాలకు ప్రయత్నించడం కూడా జరుగుతుంది. లైంగిక సుఖాల పరంగా ఆలోచనలు మారడం, ప్రయత్నాలు పెరగడం వంటివి జరుగుతాయి. పెడధోరణులు ప్రబలే సూచనలున్నాయి.
- కర్కాటకం: ఈ రాశిలోనే శుక్రుడు వక్రించడం వల్ల లైంగిక ధోరణులు శ్రుతి మించే అవకాశం ఉంటుంది. అయితే, దాంపత్య జీవితం పటిష్టం కావడం, దాంపత్యపరంగా ఏవైనా సమస్యలుంటే తొలగిపోవడం కూడా జరుగుతుంది. మొత్తం మీద, మనసులోని కోరికలకు పగ్గాలు వేయడం కష్టమవుతుంది. లైంగిక వాంఛలకు సంబంధించి మనసు పరిపరి విధాలా పోతుంటుంది. ఒక్కోసారి విచక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా దూకుడు బాగా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో, అంటే శయన స్థానంలో వక్ర శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల లైంగిక జీవితం కొత్త పుంతలు తొక్కడమనేది తప్పకుండా జరుగుతుంది. రోజుకో రకమైన లైంగిక జీవితం చోటు చేసుకునే అవకాశం ఉంది. సాధారణ లైంగిక జీవితంతో తృప్తి చెందడమనేది కొద్ది నెలల వరకు సాధ్యం కాదు. అక్రమ సంబంధాలకు, అనవసర పరిచయాలకు పాకులాడే సూచనలు కూడా ఉన్నాయి. ఇదే రాశిలో ఉన్న శుక్ర నక్షత్రం పుబ్బ వారికి సుఖాలు పెరగడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో వక్ర శుక్రుడి ప్రవేశం వల్ల స్త్రీలతో పరిచయాలు పెరగడం, స్త్రీలతో మాత్రమే స్నేహాలు చేయడం, స్త్రీ సాంగత్యం ఎక్కువ కావడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు, నీచ స్త్రీ సాంగత్యం, నీచ శృంగారానికి కూడా అవకాశం ఉంటుంది. తనకంటే తక్కువ స్థాయి స్త్రీలతో కూడా సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విచక్షణ తగ్గుతుంది. అయితే, ప్రత్యేకంగా ఈ రాశివారు ఇటు వంటి వ్యవహారాలలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
- తుల: ఈ రాశి నాథుడైన శుక్రుడు దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో వక్రించడం వల్ల కోరికలను అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో సాధారణంగా సహచరులతో, సహోద్యోగులతో సంబంధాలు పెట్టు కునే అవకాశం ఉంటుంది. ఈ రాశినాథుడు శుక్రుడు వక్రించడమంటే ఈ రాశివారు ఏదో ఒక విష యంలో తప్పటడుగు వేసే అవకాశం ఉందనే భావించవచ్చు. ఈ రాశివారు శృంగార జీవితానికి సంబంధించినంత వరకూ తప్పుడు ఆలోచనలు, ప్రయత్నాలు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది.
- వృశ్చికం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో వక్ర శుక్రుడు ప్రవేశించడం వల్ల స్త్రీలతో స్నేహ సంబంధాలు బాగా పెరిగే సూచనలున్నాయి. లైంగిక కోరికలు గుర్రాల మాదిరిగా పరుగులు పెట్టే సూచనలున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిలో లైంగిక పరమైన ఆకర్షణ శక్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కోరికలు కొత్త పుంతలు తొక్కడం వల్ల వీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. అయితే, ఈ రాశివారికి దాంపత్య జీవితం పటిష్టం అయ్యే అవకాశం కూడా ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి అష్టమ రాశిలో శుక్రుడు వక్రించి ప్రవేశించడం వల్ల కొద్దిగా రహస్య కార్యకలాపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరితో సాన్నిహిత్యం ఏర్పడడానికి వీలుంది. లైంగిక సంబంధ మైన వాంఛలు విపరీతంగా పెరగడం వల్ల దాంపత్య జీవితం కూడా సంతృప్తికరంగా సాగే అవకాశం ఉంటుంది. నిగ్రహం, విచక్షణ వంటివి బాగా తగ్గే సూచనలున్నాయి. కష్ట స్థానమైన అష్టమ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ ధోరణి ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు.
- మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానంలోనే అంటే, వివాహ బంధం స్థానంలోనే వక్ర శుక్రుడి సంచారం వల్ల లైంగికంగా ఎక్కువగా పెడదోవలు పట్టే అవకాశం ఉండదు. క్రమశిక్షణకు మారుపేరైన శనీశ్వరుడి రాశి అయినందువల్ల ఈ రాశివారు ఎక్కువగా దారి తప్పడం జరగకపోవచ్చు. దాంపత్య జీవి తంలో మార్పులు తీసుకు రావడానికే ఎక్కువగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. లైంగిక స్వేచ్ఛకు సంబంధించి మనసులోని కోరికలు మనసులోనే ఉండిపోయే సూచనలున్నాయి.
- కుంభం: ఇది కూడా శనీశ్వరుడి రాశే అయినందువల్ల ఈ రాశివారు సాధారణంగా దారితప్పే అవకాశం ఉండదు. లైంగిక సంబంధమైన కోరికలు బాగా పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. పైగా ఈ రాశికి కర్కాటక రాశి షష్ట స్థానం అయినందువల్ల దారి తప్పడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సమస్యల్లో చిక్కుకునే సూచనలు కూడా ఉన్నాయి. లైంగిక ధోరణి పట్ల ఆలోచనా ధోరణిలో మార్పు రావడం జరగవచ్చు. జీవిత భాగస్వామితో విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి పంచమ స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల లైంగిక సంబంధమైన ఆలోచనలు పేట్రేగడం, ప్రకోపించడం వంటివి జరుగుతాయి. అందులోనూ ఈ రాశి వారు స్వైర కల్పనలు, ఫాంటసీలలో ఎక్కువ సమయం గడిపే తత్వం కలిగినవారు కావడం వల్ల శారీరక సంబంధాలు పెట్టుకునే కన్నా ఈ లైంగిక ధోరణిని ఎక్కువగా ఆలోచనలకే పరిమితం చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో మాత్రం కొత్త ఆలోచనలు చేసి తృప్తి చెందుతారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి