Vastu Tips: గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం విజయానికి మాత్రమే కాదు.. సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని తెలుసా..
జ్యోతిషశాస్త్రంలో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా పరిగణిస్తారు. అందుకే వివాహం, గృహ ప్రవేశం, పూజలు మొదలైన ప్రతి శుభకార్యాల్లో వీటిని ఉపయోగించడం ఆనవాయితీ. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి ఆకులను తోరణాలు కట్టడం వలన కంటి చూపు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది.
చెట్లు, మొక్కలను పూజించడం హిందూ సంస్కృతిలో పురాతన సంప్రదాయం. హిందూ సంస్కృతిలో మామిడి చెట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పండ్ల రాజుగా పరిగణించబడుతుంది. సహజ, ఆర్థిక వనరులకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా మామిడి ఆకులు, పండ్లు, బెరడు ఆయుర్వేద, గృహ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. మామిడి చెట్టును పూజిస్తారని.. దీని ఆకులతో చేసిన తోరణాన్ని పండగలు, శుభకార్యాల సమయంలో గుమ్మాలకు కడతారు. అంతేకాదు పూజ సమయంలో కలశం ఏర్పాటు చేసి.. ఆ కలశంలో మామిడి ఆకులను ఉపయోగిస్తారు. మామిడి ఆకులు, మామిడి పండ్లను వివిధ రకాల ఉపవాసాలు, పూజలలో ఉపయోగిస్తారు. మామిడి ఆకుల నుండి బెరడు వరకూ అనేక శుభ కార్యాల్లో ఉపయోగిస్తారు. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో మామిడి ఆకుల సహాయంతో ఎవరైనా సరే అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ రోజు మామిడి ఆకుల తోరణంతో కలిగే శుభ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం..
గృహ రక్షణ, చెడు దృష్టి నుంచి రక్షణ: ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి ఆకులను తోరణంగా వేలాడదీయడం వల్ల మీ ఇంటిని చెడు ద్రుష్టి నుండి రక్షించవచ్చు, సానుకూల శక్తి లోపలికి ప్రవేశిస్తుంది.
శుభ కార్యాల్లో ఉపయోగించండి: శుభ కార్యాలలో మామిడి ఆకులను ఉపయోగించడం వలన మీకు విజయం, ఆనందం, శాంతి లభిస్తుంది.
సంపద, శ్రేయస్సు ప్రాప్తి: ఇంట్లో మామిడి ఆకులను పూజ సమయంలో , లేదా గుమ్మానికి తోరణంగా ఉపయోగించడం ద్వారా సంపద, శ్రేయస్సును పొందవచ్చు.
ఆధ్యాత్మిక పురోభివృద్ధి: మామిడి ఆకులతో దేవాలయం లేదా ప్రార్థనా స్థలాన్ని అలంకరించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగిస్తారు.
చేసే ప్రతి పనిలో విజయం
హిందూ సనాతన ధర్మంలో సాంస్కృతిక విశ్వాసాల ప్రకారం, మామిడి ఆకులను వివాహ జీవితంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు తీసుకురావడానికి పవిత్రమైన పనులలో ఉపయోగిస్తారు. పూజా స్థలంలో మామిడి ఆకులను అలంకరించి పూజిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా మామిడి ఆకులతోనే కొత్త గృహ ప్రవేశం చేయాలి. జ్యోతిషశాస్త్రంలో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా పరిగణిస్తారు. అందుకే వివాహం, గృహ ప్రవేశం, పూజలు మొదలైన ప్రతి శుభకార్యాల్లో వీటిని ఉపయోగించడం ఆనవాయితీ. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి ఆకులను తోరణాలు కట్టడం వలన కంటి చూపు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది.
మామిడి ఆకుల ప్రయోజనాలు
కంటి ఆరోగ్యం: మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి మీ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది: మామిడి ఆకులు అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యల వంటి జీర్ణవ్యవస్థ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
యాంటీవైరల్ లక్షణాలు: మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి.
చల్లదనం: మామిడి ఆకులు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఇది చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. వేడి వేసవి కాలంలో ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)