Independence Day: కారుపై త్రివర్ణ పతాకం రంగును వేయించుకున్నారా? జాగ్రత్త జైలుపాలవుతారు..!

ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవడానికి తమ వాహనాలపై జెండాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. మరికొందరు తమ వాహనాలకు నేషనల్ ఫ్లాగ్ కలర్స్ వేయించుకుంటున్నారు. అయితే, దీని వల్ల మీరు ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉంది. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అవును, మార్కెట్‌లో రోడ్లపై ఎక్కబడితే అక్కడ త్రివర్ణ పతాకాలు అమ్ముతున్నారు.

Independence Day: కారుపై త్రివర్ణ పతాకం రంగును వేయించుకున్నారా? జాగ్రత్త జైలుపాలవుతారు..!
Indian Flag Tricolour
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2023 | 10:35 AM

స్వాతంత్య్ర దినోత్సవానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవడానికి తమ వాహనాలపై జెండాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. మరికొందరు తమ వాహనాలకు నేషనల్ ఫ్లాగ్ కలర్స్ వేయించుకుంటున్నారు. అయితే, దీని వల్ల మీరు ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉంది. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అవును, మార్కెట్‌లో రోడ్లపై ఎక్కబడితే అక్కడ త్రివర్ణ పతాకాలు అమ్ముతున్నారు. మీ కారు, బైక్‌కి త్రివర్ణ పతాకాలు సెట్ చేసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇండియన్ ఫ్లాగ్ కోడ్..

ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం.. కొంతమంది ప్రత్యేక వ్యక్తుల వాహనాలపై మాత్రమే జాతీయ జెండాను ఏర్పాటు చేసే హక్కు ఉంది. మీకు అలాంటి హోదా లేకపోతే, మీ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచినట్లయితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి జాతీయ జెండాను ఎగురవేయడానికి సంబంధించి 21 సంవత్సరాల క్రితమే అంటే 2002 సంవత్సరంలో ఇండియన్ ఫ్లాగ్ కోడ్‌ను రూపొందించారు. ఈ నిబంధనల్లో ఒకటి వాహనాలపై ఎవరు జెండాను పెట్టవచ్చు.. ఎవరు పెట్టకూడదు అనేవి కూడా ఉన్నాయి.

వీరికి మాత్రమే అధికారం..

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్(లోక్‌సభ-రాజ్యసభ), గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి వాహనాలపై మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇక రాష్ట్రాల స్పీకర్, డిప్యూటీ స్పీకర్(విధాన సభ-విధాన పరిషత్), భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి సహా మరికొందరు వాహనాలపై జెండాను ఏర్పాటు చేయొచ్చు. వీరి వాహనాలు కాకుండా మరేదైనా వాహనంపై త్రివర్ణ పతాకం కనిపిస్తే పోలీసులు చలాన్ విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే, వాహనాలపై జెండా ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు అనేక మార్పులు చేశారు. 2004 సంవత్సరంలో ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి ఇచ్చారు. అంతకు ముందు ప్రజలు ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లేదు. ఇక ప్రస్తుతం రాత్రిపూట కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయొచ్చు. 2009కి ముందు రాత్రి వేళ జెండా ఎగురుతూ ఉండకూడదు. అయితే, అదే సంవత్సరంలో కొన్ని షరతులతో రాత్రివేళ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. త్రివర్ణ పతాకం ఎగురుతున్న చోట చీకటి లేకుండా.. ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని షరతు విధించింది. అంటే అక్కడ చీకట పడినట్లు భావనే రాకుండా ఉండాలన్నమాట.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?